South Africa in Finals: టీ 20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో తొలిసారి సౌతాఫ్రికా.. 

టీ20 వరల్డ్ కప్ లో తొలిసారి సౌతాఫ్రికా ఫైనల్స్ లోకి అడుగు పెట్టి చరిత్ర సృష్టించింది.  ఆఫ్గనిస్తాన్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు సాయంత్రం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ లో విజేతతో ఫైనల్ లో సౌతాఫ్రికా తలపడుతుంది. 

South Africa in Finals: టీ 20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో తొలిసారి సౌతాఫ్రికా.. 
New Update

South Africa in Finals: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తుగా ఓడించి దక్షిణాఫ్రికా 2024 T20 ప్రపంచ కప్ ఫైనల్ టిక్కెట్‌ను గెలుచుకుంది. దీంతో 2024 టీ20 ప్రపంచకప్‌లో తొలి ఫైనలిస్ట్ జట్టు ఖరారైంది. ఇప్పుడు జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్‌లో గెలిచిన జట్టుతో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ 2024 తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘానా విజయం సాధించింది. 

South Africa in Finals: టోర్నీ చరిత్రలో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. దీనికి ముందు, 2009,  2014 T20 ప్రపంచ కప్‌లో ఈ మైలురాయిని సాధించడానికి రెండు అవకాశాలను కోల్పోయింది. అప్పుడు దక్షిణాఫ్రికా పాకిస్థాన్‌, భారత్‌ల చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కానీ, ఈసారి ఆఫ్ఘనిస్థాన్ ఆకాంక్షలను తుంగలో తొక్కుతూ చారిత్రాత్మక విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.  ఈ విషయంలో, ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం దక్షిణాఫ్రికాకు చరిత్రాత్మకం. టోర్నీ ఫైనల్ వరకు దక్షిణాఫ్రికా విజయ రథంపై నడిచింది.  2024 T20 ప్రపంచ కప్‌లో సౌతాఫ్రికాకు ఇది వరుసగా 8వ మ్యాచ్.. అన్ని మ్యాచ్ లు గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టింది సౌతాఫ్రికా. 

ఆఫ్ఘనిస్థాన్ పేలవమైన బ్యాటింగ్.. 

South Africa in Finals: మ్యాచ్ గురించి చూస్తే,  ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే, దక్షిణాఫ్రికా భీకర బౌలింగ్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ బ్యాటింగ్ చాలా ఘోరంగా విఫలం అయింది.  ఆఫ్ఘన్ బ్యాటర్లు  పూర్తి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయారు. వారి  ఇన్నింగ్స్ కేవలం 11.5 ఓవర్లలోనే ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 56 పరుగులు మాత్రమే చేసి దక్షిణాఫ్రికాకు 57 పరుగుల లక్ష్యాన్ని అందించింది.

8.5 ఓవర్లలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది

South Africa in Finals: ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన  దక్షిణాఫ్రికా జట్టు కేవలం 8.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 57 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. 1 పరుగు చేసి ఔట్ అయిన క్వింటన్ డి కాక్ రూపంలో దక్షిణాఫ్రికా ఏకైక వికెట్ పడింది. ఫరూఖీ డి కాక్ వికెట్ తీశాడు. ఆ తర్వాత రీజా హెండ్రిక్స్ (29 పరుగులతో నాటౌట్), ఐడెన్ మార్క్రామ్ (23 పరుగులతో నాటౌట్) జట్టును సునాయాసంగా విజయతీరాలకు చేర్చారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe