Miniter Seethakka: త్వరలో అంగన్‌ వాడీలో 11 వేల పోస్టుల భర్తీ!

Miniter Seethakka: త్వరలో అంగన్‌ వాడీలో 11 వేల పోస్టుల భర్తీ!
New Update

Anganwadi : రాష్ట్రంలో అతి త్వరలోనే 11 వేల అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు. 15 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్లే స్కూళ్లను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ.. తన శాఖల స్థితిగతులు, పాలన తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర అంశాలను మంత్రి సీతక్క వివరించారు.

స్త్రీ శిశు సంక్షేమంలో అంగన్‌వాడీలదే ముఖ్యమైన పాత్ర అని మంత్రి సీతక్క అన్నారు. లోపాలను అరికట్టి ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పర్యవేక్షణ చర్యలు చేపట్టినట్లు ఆమె వివరించారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కాంట్రాక్టు రెండేళ్ల పాటు ఒకే గుత్తేదారుకు ఇవ్వడం వల్ల నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అధికారంలోకి వచ్చాక ఆ నిబంధనలు అన్ని మారాయని... ఆహారం, గుడ్ల సరఫరా పకడ్బందీగా సాగుతోందని అన్నారు. అంగన్‌వాడీలకు ఫర్నిచర్, ఇతర సామగ్రిని సమకూర్చినట్లు పేర్కొన్నారు. వాటిలో 11 వేల ఖాళీలను గుర్తించామని చెప్పిన మంత్రి త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ విరమణ సమయంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ. రెండు లక్షలు, ఆయాలకు రూ. లక్ష చెల్లిస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలో 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలుండగా (Anganwadi Centers) 15 వేలల్లో నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీని కోసం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చామని వివరించారు. ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తామని తద్వారా పిల్లలు నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేరతారని వివరించారు.

Also read: మూడు నెలలుగా జీతం అందుకోని పినాకి చంద్రఘోష్!

#telangana #seethakka #aganwadi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe