Electronics: కొత్త పాకెట్ ఏసీని లాంచ్ చేసిన సోనీ

ఎండలు, వేడికి ఉపశమనంగా సోనీ ఓ కొత్త పరికరాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. మనిషితో పాటూ నడిచే ఏసీని తీసుకువచ్చింది. రియోన్ పాకెట్ 5 అనే పేరుతో మనల్ని ఎప్పుడూ చల్లగా ఉంచే మెషీన్‌ను ఇంట్రడ్యూస్ చేసింది సోనీ.

New Update
Electronics: కొత్త పాకెట్ ఏసీని లాంచ్ చేసిన సోనీ

Reon pocket AC:

ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత మూడురోజులుగా అయితే విపరీతమైన వేడి చంపేస్తోంది. ఏసీలో ఉననంత సేపూ బాగానే ఉటుంది. బయటకు వస్తే మాత్రం మాడి మసి అయిపోతున్నాం. దీంతో మనతో పాటూ ఒక నడిచే ఏసీ ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారు జనాలు. అలాంటి వారి కోసమే సోనీ ఒక కొత్త ప్రోడక్ట్‌ను లాంచ్ చేసింది. మనుషులు ధరించే ఏసీని లాంచ్ చేసింది. దీనిని మన షర్ట్ వెనకవైపు తగిలించుకుంటే చాలు..ఎక్కడ ఉన్నా, ఎంత ఎండలో ఉన్నా కూడా మనం చల్లగానే ఉంటాము.

రియాన్ పాకెట్5గా పిలబడే ఈ స్మార్ట్ ఏసీ పరికరాన్ని సోనీ ఈ నెల 23న మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీనిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. మనకు కాలవ్సినంత చల్లదనం పెట్టుకునేలా, వాతావరణానికి అనుకూలంగా నియంత్రణ వ్యవస్థ లాంటి టెక్నాలజీలు అన్నీ ఉన్నాయి. ఇది థర్మోస్ మాడ్యూల్, సెన్సార్ సూట్‌లను కలిగి ఉంటుంది. వీటా ద్వారానే మన శరీరానికి ఈ పరికరం చల్లదనాన్ని అందిస్తుంది. ఇందులో చల్లదనం, వేడి మోడ్‌లు కూడా ఉన్నాయి. కూలింగ్‌లో ఐదు స్థాయిలు, వార్మ మోడ్‌లో నాలుగు స్థాయిలున్నాయి. చల్లదనం ఉన్నచోట వార్మ్‌గా కూడా ఉండేలా మెషీన్‌ను మార్చుకోవచ్చును.

రియాన్ పాకెట్ మోడల్ ఏసీ రిమోట్ సెన్సార్‌లా పని చేస్తుంది అని చెబుతోంది సోనీ. మన చుట్టు పక్కల ఉన్న పరిస్థితులను ఆటోమేటిక్‌గా గుర్తించి మెషీన్‌లో ఉష్ఱోగ్రతలను సర్దుబాటు చేసుకుంటుంది. ఈ పాకెట్ ఏసీ కేవలం మన శరీర ఉష్ణోగ్రత మీద మాత్రమే దృష్టిని పెడుతుందని...దాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుందని అంటోంది సోనీ. దీన్ని మన ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చును. ఫోన్‌తోనే ఆపరేట్ కూడా చేసుకోవచ్చును కూడా. ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటితోనూ పని చేస్తుంది. రియాన్ పాకెట్ ఏసీ బ్యాటరీతో పిన చేస్తుంది. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే దాదాపు 17 గంటలు కంటిన్యూగా పని చేస్తుందని తెలిపింది సోనీ.

అయితే ఈ రియాన్ పాకెట్ ఏసీ కొత్తదేమీ కాదని.. జపాన్‌లో ఎప్పుడో లాంచ్ అయిందని చెబుతోంది సోనీ. దీనిని అక్కడ 2019 నుంచే వాడుతున్నారని తెపింది. దీని తర్వాత వెర్షన్‌లు హాంకాంగ్ లాంటి దేశాల్లో లాంచ్ అయి సక్సెస్ సాధించాయని..యూకే మార్కెట్లో కూడా ఇది పాపులర్ అవడంతో దీనిని మరింత వ్యిప్తి చేయాలని అనుకున్నామని అంటోంది. రియాన్ పాకెట్ మోడల్ ఏసీలను సోనీ వెబ్‌సైట్‌లో ముందుగానే బుక్ చేసుకోవచ్చును. దీని ధర 139 పౌండ్లు..అంటే మన రూపాయల్లో 14, 500 గా ఉంది. ప్రీ అర్డర్ చేసుకుంటే మే 15 నుంచి షిప్పింగ్ చేస్తామని చెప్పింది సోనీ కంపెనీ. బేస్ ప్యకేజీ, రియాన్ 5T అనే రెండు మోడళ్ళు ఇందులో ఉన్నాయి. ఏసీ మెసీన్‌తో పాటూ నెక్ బ్యాండ్ కూడా వస్తుంది. టచ్ మోడల్ కావాలనుకునేవారు అదనంగా మరో 25 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరికరం రెండు రకాల ఎయిర్ వెంట్‌లను కలిగి ఉంటుంది. ఒకటి కాలర్ వెనుక వరకు విసర్తించినట్టుగా ఉంటే మరొకటి క్యాజువల్ స్ట్ఐల్‌కు నరిపోయేలా ఉంటుందని చెబుతోంది. కొత్త REON POCKET 5 సింగపూర్‌లో మే 2024 నుండి అందుబాటులో ఉంటుంది మరియు మలేషియా, థాయ్‌లాండ్ మరియు వియత్నాంలో తర్వాత తేదీలో అందుబాటులో ఉంటుంది.

Also Read:Bird Flu: బర్డ్‌ఫ్లూ అదుపులోనే ఉంది..నివారణ దిశగా చర్యలు- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు