Roshan Kumar : నియోజకవర్గ సమస్యలకు పరిష్కరం కావాలంటే.. ఇలా జరగాలి..!

ఏలూరు జిల్లా సుప్రీం పేట గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..చింతలపూడి నియోజకవర్గ సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Roshan Kumar : నియోజకవర్గ సమస్యలకు పరిష్కరం కావాలంటే.. ఇలా జరగాలి..!
New Update

Songa Roshan Kumar : ఏలూరు(Eluru) జిల్లా చింతలపూడి మండలంలోని సుప్రీం పేట గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. రోషన్ కుమార్ మాట్లాడుతూ.. సుప్రీంపేట అంటే తన సొంత ఊరు తన సొంత ప్రజలని.. వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానాలు తాను ఎప్పటికీ గుర్తించుకుంటానన్నారు.

Also Read: ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన RTV.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

తాను నామినేషన్ వేసింది తన కోసం కాదని, చింతలపూడి నియోజకవర్గ యువత కోసం అభివృద్ధి కోసమేనన్నారు. ఇక్కడి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటన్నిటినీ పరిష్కరించాలంటే కూటమి ప్రభుత్వం రావాలన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.

#eluru-district #ap-tdp #songa-roshan-kumar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe