Communication Tips: కొందరు మాటలు ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. కొంత వరకు ఓపిక పట్టొచ్చు కానీ మితిమీరినా రోజూ అలాగే వ్యవహరిస్తుంటే మాత్రం ఎంతో అసౌకర్యానికి గురవుతూ ఉంటాం. ఒక వ్యక్తితో మాట్లాడే విధానం ఎలా ఉండాలంతే అవతలివారికి చిరాకు కలిగించకూడదు. వ్యక్తి స్థాయిని బట్టి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఏ అంశంపై మాట్లాడుతున్నారో దానిపైనే దృష్టిపెట్టాలి. అనవసర విషయాలను అవైడ్ చేయడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. కొందరు సహజంగానే ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాంటి వారు మనం చెప్పేది వినిపించుకోకుండా వాళ్లు చెప్పాలనుకున్నదే చెబుతూ ఉంటారు. ఎందుకంటే వీటికి కొన్ని కారణాలు ఉంటాయని సైకాలజీ నిపుణులు అంటున్నారు. అలా అతిగా మాట్లాడేవారితో ఇలా వ్యవహరించాలని చెబుతున్నారు.
సూటిగా ఉండటం:
- మనం సూటిగా మాట్లాడటం వల్ల అవతలివారు కూడా పాయింట్‌ను మాట్లాడుతారు. అంతేకాకుండా వాళ్లు చెప్పేదాన్ని విమర్శించకుండా ముందు చెప్పనిచ్చి ఆ తర్వాత అతిగా మాట్లాడితే మీరు కలుగజేసుకుని అసలు విషయం చెప్పమనాలి. అంతేకాకుండా వాళ్లు ఎక్కువగా మాట్లాడితే అది మనల్ని ఎంత బాధపెడుతున్నాయో వివరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే అతను కూడా ఆలోచించడం మొదలుపెడతారని, అప్పుడు మనం చెప్పేదాన్ని సంయమనంతో వింటాడని నిపుణులు అంటున్నారు.
మాట్లాడే స్టైయిల్ మార్చండి:
- ఇలా చేయడం వల్ల మాట్లాడే నైపుణ్యాలు పెరుగుతాయి. సంభాషణలో ఆధిపత్యం చెలాయించడానికి కూడా ఉపయోగపడుతుంది. అవతలివారు నాన్ స్టాప్‌గా మాట్లాడుతుంటే విసుగుచెందినట్టు ఉండటం, ఫోన్ వైపు చూస్తూ ఉండటం, లేదా దూరంగా చూడటం వల్ల కూడా అవతలివారు ఆగిపోతారు. అంతేకాకుండా మనకు మాట్లాడే అవకాశం కలుగుతుంది. అంతేకానీ వాదించడం వల్ల పోటీ పెరుగుతుంది.. పోటాపోటీగా వాదించడం వల్ల మన శక్తి కూడా పోతుంది. ఒకవేళ అవతలి వ్యక్తి హేతుబద్ధంగా, క్లుప్తంగా చెబుతున్నప్పుడు మీరు మాత్రం శ్రద్ధగా గమనించాలి. అతను చెప్పిన విషయం గురించి ఆలోచించాలని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి : వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆసనాలు వేయాల్సిందే
గమనిక :ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.