Somavati Amavasya: సోమవతి అమావాస్య రోజు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు

సోమవతి అమావాస్య 8 ఏప్రిల్ 2024న వస్తుంది. ఆ రోజూ ఉదయం 04.32 నుంచి 05.18 లోపు స్నానం చేయాలి. ఉదయం 9.13 నుంచి 10.48 లోపు శివపూజకు అనుకూలంగా ఉంటుంది. ఉపవాసం ఉన్న వారికి అఖండ సౌభాగ్యం, సంతోషం, విజయం, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.

New Update
Somavati Amavasya: సోమవతి అమావాస్య రోజు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు

Somavati Amavasya:హిందూమతంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా సోమవారం, శనివారం వచ్చే అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సారి వచ్చే సోమవతి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజు సోమవారం సోమావతి అమావాస్యతో కలిసి వస్తుంది.

publive-image

ఈసారి సోమవతి అమావాస్య ఎప్పుడు..?

ఈ సంవత్సరం మొదటి సోమవతి అమావాస్య 8 ఏప్రిల్ 2024న వస్తుంది. అమావాస్య, సోమవారం రెండింటిలోనూ శివారాధన ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అలాంటి ఈ రోజున ఏం చేసినా రెట్టింపు ఫలితాలు ఉంటాయి.

publive-image

ఏ సమయం మంచిది..?

ఈసారి సోమవతి అమావాస్య 8 ఏప్రిల్ 2024 సోమవారం తెల్లవారుజామున 03:21 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 11:50 గంటల వరకు ఉంటుంది. ఉదయం 04.32 నుంచి 05.18 లోపు స్నానం చేయాలి. ఉదయం 9.13 నుంచి 10.48 లోపు శివపూజకు అనుకూలంగ కుంటుంది. పూర్వీకులకు నైవేద్యం పెట్టాలనుకుంటే మాత్రం ఉదయం 11.58 నుంచి మధ్యాహ్నం 12.48 వరకు మంచిదని పెద్దలు చెబుతున్నారు.

publive-image

ఈ రోజు శివుడిని ఎలా పూజించాలి..?

శాస్త్రాల ప్రకారం.. సోమవతి అమావాస్య నాడు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే భర్తలు ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు. ఈ రోజు వారి వైవాహిక జీవితం బాగుండాలంటే పిండి, బియ్యం, నెయ్యి, పంచదార దానం చేయాలి. ఉపవాసం ఉన్న వ్యక్తికి అఖండ సౌభాగ్యం, సంతోషం, విజయం, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున ఉదయం స్నానం చేసి శివలింగానికి పచ్చి పాలు, గంగాజలంతో అభిషేకం చేస్తే పిత్ర దోషం, కాలసర్ప దోషాల నుంచి విముక్తి పొందుతారు. పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందుతాయని పండితులు చెబుతున్నారు.

publive-image

సోమవతి అమావాస్య పూజా విధానం:

సోమవతి అమావాస్య నాడు ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత పంచామృతంతో శివునికి అభిషేకం చేయండి. అప్పుడు పచ్చి పాలతో చెట్టుకు నీళ్ళు పోసి దాని చుట్టూ 7 సార్లు తిరగండి. సాయంత్రం వేళ చెట్టు కింద దీపం వెలిగించండి. ఇది శివుడు, లక్ష్మీ దేవి, శని దేవుడిని సంతోషపరుస్తుంది. మధ్యాహ్నం నువ్వులను నీళ్లలో వేసి దక్షిణ దిక్కున పూర్వీకుల పేరుతో నైవేద్యంగా సమర్పించాలి.

ఇది కూడా చదవండి:బ్యాక్టీరియా పోవాలంటే ద్రాక్షపండ్లను ఎలా శుభ్రం చేయాలి?..నిల్వ చేయడం ఎలా?

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు