సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న నిజామాబాద్ కుర్రాడు.. టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఈ మధ్య కాలంలో తెలంగాణ కుర్రాడు పునీత్ రాజ్ డ్యాన్స్,యాక్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కుర్రాడి డ్యాన్సింగ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కు నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఓ వైపు చదువు కుంటూనే మరో వైపు తన డ్యాన్స్ తో అలరిస్తున్నాడు.

New Update
సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న నిజామాబాద్ కుర్రాడు.. టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Social Media Influencer Punith Raj : సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. వారిలో ట్రోలింగ్ తో ఫేమస్ అయిన వాళ్ళు కొందరైతే.. తమ యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ లో పాపులర్ అయిన వాళ్ళు ఇంకొందరు. అలా ఈ మధ్య కాలంలో ఓ తెలంగాణ కుర్రాడి డ్యాన్స్,యాక్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కుర్రాడి డ్యాన్సింగ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కు నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు.

ఓ వైపు చదువు కుంటూనే మరో వైపు తన డ్యాన్స్ తో అలరిస్తున్నాడు. అతని పేరే పునీత్ రాజ్.. నిజామాబాద్ కు చెందిన ఇతను డ్యాన్స్, యాక్టింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఓ వైపు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూనే పార్ట్ టైమ్ సోషల్ మీడియా సృష్టికర్తగా తనకంటూ స్పెషల్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఇతని డైనమిక్ డ్యాన్స్ మరియు యాక్టింగ్ వీడియోలు భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాయి.

Also Read : శ్రీవిష్ణు ‘స్వాగ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న ‘సింగరో సింగ’ సాంగ్!

ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన 'జోష్‌' లో పునీత్ వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్ అందుకున్నాయి. ఈ ప్లాట్ ఫామ్ ద్వారానే పునీత్ నెటిజన్స్ అందరికీ దగ్గరవుతూ తన టాలెంట్ తో ఆకట్టుకుంటున్నాడు. యాక్టర్ అవ్వాలనే క్రమంలో ఈ జర్నీని స్టార్ట్ చేసిన పునీత్ రాజ్ కు సోషల్ మీడియాలో వేళా మంది సపోర్ట్ చేయడం విశేషం.

Advertisment
తాజా కథనాలు