బొప్పాయితో అనేక ప్రయోజనాలు..తింటే బరువు ఇట్టే తగ్గుతారు! ఇప్పటికే ఆహారపు అలవాట్లలో జనం మార్పులు చేసుకున్నారు. తేనె, అల్లం, మిరియాలు అంటూ ఆహారంలో ఈ పదార్థాలను భాగం చేసుకుంటున్నారు. ఆహారంలో భాగం చేసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. By Durga Rao 01 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి బొప్పాయిలో బోలెడంత ఫైబర్ ఉంటుంది. ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి, బి, ఈ, కే, పొటాషియం వంటివి ఇందులో ఉన్నాయి. బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లెమ్యాటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. బొప్పాయి పండు మాత్రమే కాదు, ఆకులు కూడా ఆరోగ్యకరమేనని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ట కౌంట్ పెంచేందుకు ఆకులు ఉపయోగపడతాయని వారు చెప్తున్నారు. ముఖ్యంగా బొప్పాయి విత్తనాలతో కండరాలు దృఢంగా మారుతాయి. పని ఒత్తిడి కారణంగా కలిగే అలసట తగ్గుతుంది. ఫలితంగా రోజంతా యాక్టివ్‌గా పనిచేయవచ్చు. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పలు రకాల ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు వంటివి రావు. బొప్పాయి విత్తనాలను రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవచ్చు. విత్తనాలను డైరెక్ట్‌గా తినలేమని అనుకునే వారు, వాటిని పొడి చేసుకుని దాన్ని మజ్జిగ, లేదా ఏదైనా సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు. అలాగే ఉదయాన్నే పరగడుపునే రెండు స్పూన్ల బొప్పాయి విత్తనాలను రోజూ తింటుంటే మధుమేహం, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కిడ్నీ, కాలేయ సమస్యలు పోవడమే కాకుండా జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. శరీర బరువును తగ్గించడంలో బొప్పాయి విత్తనాలను ఎంతో పనిచేస్తాయి. బొప్పాయి విత్తనాల వల్ల జీర్ణాశయంలో ఉండే క్రిములు నాశనమవుతాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ప్రధానంగా కడుపులో ఉండే పలు రకాల పురుగులు నశిస్తాయి. బొప్పాయి విత్తనాల్లో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గిస్తాయి. శరీర మెటబాలిజం రేటును పెంచడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. #benefits-of-papaya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి