Snake in food: పప్పులో పాము..ఈసీఐఎల్‌ కంపెనీ క్యాంటీన్‌ నిర్లక్ష్యంతో 150మందికి అస్వస్థత!

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఈసీఐఎల్‌(ECIL) కంపెనీ క్యాంటీన్‌ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తినే పప్పులో పాము పిల్ల కనిపించడం కలకలం రేపింది. ఆ పప్పు తిన్న చాలామంది అస్వస్థతకు గురయ్యారని సమాచారం.

Snake in food: పప్పులో పాము..ఈసీఐఎల్‌  కంపెనీ క్యాంటీన్‌ నిర్లక్ష్యంతో 150మందికి అస్వస్థత!
New Update

తింటున్నారు కదా ఏది పడితే అది పెట్టడం..కూరలు ఎలా పడితే అలా వండడం..పప్పుల్లో, సాంబారుల్లో కప్పలు పడినా..బల్లులు పడినా.. ఆఖరికి పాములు పడినా కనపడడంలేదా? మేడ్చల్ జిల్లా(Medchal) మల్కాజిగిరి ఈసీఐఎల్‌(ECIL) కంపెనీ క్యాంటీన్‌ నిర్వాకం బయటపడింది. తినే పప్పు(dal)లో పాము(snake) పిల్ల కనిపించడం కలకలం రేపింది. ఆ పప్పు తిన్న చాలామంది అస్వస్థతకు గురయ్యారని సమాచారం. తమ ఆరోగ్యం పట్ల కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

publive-image పప్పులో పాము..ఈసీఐఎల్‌ కంపెనీ క్యాంటీన్‌ నిర్లక్ష్యం

కంపెనీ ఎదుట ధర్నా:
చర్లపల్లిలోని ఈసీఐఎల్‌, ఈయంఎస్‌డీ కంపెనీలో నైట్ డ్యూటీకి వచ్చిన కార్మికులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. క్యాంటీన్‌ పప్పు కూరల్లో పాము రావడంతో భయాందోళనలకు గురైన కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. కంపెనీ యాజమాన్యం ఎవరికి తెలియనివ్వకుండా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు సమాచారం. లోపల వర్కర్స్‌కి కంపెనీలోనే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇచ్చి ఇంటికి పంపారని ఆరోపణలు వినిపిస్తున్నారు. జరిగిన దాని గురించి బయటకి చెబితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. క్యాంటీన్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల చాలా మంది అస్వస్థకు గురయ్యారని.. అసలు పప్పులో పాము రావడమేంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. క్యాంటీన్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కార్మికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 150 మందికి పైగా ఆహారాన్ని తీసుకుని అస్వస్థతకు గురయ్యారని ఆందోళన చేపట్టారు.

వడ్డిస్తుండగా వచ్చిన పాము:
ఈసీఐఎల్‌ క్యాంటీన్‌లో భోజనం వడ్డిస్తుండగా పాము పిల్ల పప్పులో వచ్చినట్టు తేలింది. అయితే ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ తరహా ఘటనలే వెలుగుచూశాయి. ఆహార పదార్ధాల్లో పాము పిల్లలే కాదు.. బీడీలు, సిగరెట్టు, పురుగులు, ఎలుకలు కూడా గతంలో వచ్చినట్టు కార్మికులు చెబుతున్నారు. అసలు ఆహారం విషయంలో నాణ్యత లేదని.. తమ ఆరోగ్యాలంటే కంపెనీకి లెక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కంపెనీ క్యాంటీన్‌లో నిత్యం వేలాది మంది భోజనం చేస్తుంటారు. చాలా కుటుంబాలు ఈ ఉద్యోగాలపైనే ఆధారపడి ఉంటాయి.. కుటుంబంలో ఎవరికైనా జరగకూడనది జరిగితే అది జీవితాంతం వెంటాడుతుంది. ఈ విషయాలన్ని కంపెనీకి తెలియనవి కావు..అయినా కూడా నిర్లక్ష్యం.. ఎవరు ఏమైపోతే మనకెందుకులే అనుకునే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. కంపెనీ కూడా అదే విధంగా ఉన్నట్టు అర్థమవుతుంది. అందుకే తరుచుగా ఇలాంటి ఘటనలే వెలుగుచూస్తున్నాయి.. ఇప్పటికైనా కంపెనీ తీరు మారకుంటే అది చాలా అనర్థాలకు దారి తీస్తుంది. మరోవైపు క్యాంటీన్‌లో ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కార్మికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe