Viral Video: ఆ దేశంలో చెట్లపై పండ్లకు బదులు పాములు ఉంటాయ్...!!

పశువులు, కుందేళ్లు, గొర్రెలు,మేకల పెంపకం గురించి విన్నాం..కానీ..పాముల పెంపకం (snake farming garden) గురించి ఎప్పుడైనా చూశారా? అవును మీరు చదివింది కరెక్టే. పాముల పెంపకం గురించే మేము చెప్పేది. ఒకపామును చూస్తేనే...పదికిలోమీటర్ల దూరం పరిగెడుతుంటాం. అలాంటిది పాముల పెంపకం అంటే...ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదూ. ఆ దేశంలో పాములను పెంచుతుంటారు. ఈ చెట్టు చూసినా పండ్లకు బదులు పాములు కనిపిస్తుంటాయి. ఎక్కడో చూద్దాం.

New Update
Viral Video: ఆ దేశంలో చెట్లపై పండ్లకు బదులు పాములు ఉంటాయ్...!!

సాధారణంగా చెట్లకు ఆకులు, పండ్లు ఉంటాయి. మామిడి, జామ, లిచ్చి వంటి పండ్ల తోటలో చెట్లకు గుత్తుగుత్తులుగా పండ్లు వేలాడుతుంటాయి. కానీ పండ్లకు బదులు పాములు (snakes) వేలాడుతుంటే ఎలా ఉంటుంది. అలా వేలాడం ఎప్పుడైనా చూశారా? వియాత్నంలో (vietnam) పండ్లకు బదులను పాములను పెంచుతారు. చెట్లపై పాములు వేలాడుతూ కనిపిస్తాయి. చెట్ల కొమ్మలపై పాములు చుట్టి ఉంటాయి. చెట్లపై మీ కళ్ళు పడగానే మీకు పాములు కనిపిస్తాయి. ఈ తోట పేరు డాంగ్ టామ్ స్నేక్ ఫామ్ (snake farming garden). పొలాల్లో పండ్లు, కూరగాయలు ఎలా పండిస్తారో, అదే విధంగా ఇక్కడ పాములను పెంచుతున్నారు.

publive-image

అంతే కాకుండా ఔషధ మూలికలను కూడా ఈ పొలంలో పండిస్తారు. ఈ గార్డెన్‌లో దాదాపు 400 రకాల పాములను పెంచుతున్నారు. ఈ పాముల విషం నుండి అనేక రకాల ఔషధాలను తయారు చేస్తారు. పాముల విషాన్ని కాటు వేయడానికి యాంటీడోస్ కూడా తయారు చేస్తారు. ఈ ఉద్యానవనాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

ఈ వీడియోను ( Viral Video) ఇన్‌స్టాగ్రామ్ లో @kohtshoww అనే నెటిజన్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను కోట్లాది మంది వీక్షించారు, లక్షలాది మంది లైక్ చేశారు. ఇంతకుముందు ఈ ఉద్యానవనం పరిశోధన కోసం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఇది భారీ పర్యాటక కేంద్రంగా మారింది. పాము కాటుకు గురై చికిత్స కోసం ఏటా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. యాంటిడోస్ తయారు చేసి ఎక్కడ ఇస్తున్నారు. దీని వల్ల శరీరంలోని పాము విషం అంతమవుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు