Smoking: సిగరేట్‌ అలవాటు ఉందా? ఇది చదవండి.. దెబ్బకు మానేస్తారు..!

సిగరేట్‌ తాగడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు లాంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మెదడు, కాళ్లకు, రక్త ప్రసరణని స్మోకింగ్‌ అడ్డుకుంటుంది.

Smoking: సిగరేట్‌ అలవాటు ఉందా? ఇది చదవండి.. దెబ్బకు మానేస్తారు..!
New Update

పొగ తాగడం అనేది ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయింది. చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు, స్రీలు, పురుషుల.. ఇలా ఎలాంటి తేడా లేకుండా పొగ తాగుతున్నారు. కొంత మంది బాధలు మరిచిపోవడానికి, మరి కొంత మంది పని ఒత్తిడి తగ్గడానికి, ఇంకొంతమంది ఆకతాయిగా, మరికొంతమంది స్టైల్ అని.. ప్యాషన్ అని ఇలా పలు రకాల కారణాల వాళ్ళ సిగరేట్ స్మోక్ చేస్తున్నారు.

ధూమపానానికి గల కారణాలు ఏంటి ..??

➼ ధూమపానంతో సంతోషాన్నిపొందవచ్చని అనుకోవడం
➼ పని లో ఏకాగ్రత పెరుగుతుందని భావించడం
➼ కొన్ని విషయాల నుంచి విశ్రాంతి కోసం

సిగరెట్ తగినపుడు అందులో ఉండే నికోటిన్ మెదడు పైన ప్రభావం చూపిస్తుంది. డోపమైన్ అనే రసాయనాన్ని మెదడు నుంచి విడుదల అయ్యేలా చేస్తుంది. ఈ పొగ తాగడం వాళ్ళ ప్రయోజనం తాత్కాలికమే. తరచుగా పొగ తాగడం వాళ్ళ నికోటిన్ కి అడిక్ట్ అవుతారు. సిగరెట్ తాగకుండా ఉండలేకపోతారు. సిగరెట్ తాగకపోతే ఏదో కోల్పోయిన భావనతో పాటు చిరాకు కలుగుతుందని భావిస్తారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

పొగాకు శరీరాన్ని ఎలా దెబ్బ తీస్తుంది ...??

➼ నికోటిన్ వెయిన్స్, ఆర్టెరీస్‌పై నెగిటివ్‌ ప్రభావం చూపుతుంది.
➼ ఇది హృదయాన్ని వేగంగా పని చెయ్యమని బలవంతం చెస్తుంది.
➼ ఊపిరితిత్తులను తక్కువ గాలిని మాత్రమే పీల్చుకునేలా చేస్తాయి.
➼ పొగలోని చిన్న చిన్న కణాలు గోంతు, ఊపిరితిత్తుల్లో చేరి ఇబ్బందులకు గురి చేస్తాయి. కాలక్రమేణా దగ్గుకి కారణం అవుతుంది.
➼ అదే విధంగా ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బ తీస్తుంది.
➼ అమోనియా.. కళ్ళు,ముక్కు,గొంతు సమస్యలకి గురి చేస్తాయి

ధూమపానం వాళ్ళ వచ్చే ఆరోగ్య సమస్యలు...??

➼ జుట్టు సహజత్వాన్ని కోల్పోవడం
➼ చర్మ సమస్యలు & చర్మం ముడతలు రావడం
➼ వేళ్ళు, నాలుక,దంతాలు పసుపు &గోధుమ రంగులోకి మారడం

publive-image ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్య ప్రభావం...??

➼ జీవన ప్రమాణం తగ్గడం
➼ జీవన నాణ్యత తగ్గడం
➼ అకాల మరణం సంభవిచడం
➼ మానసిక ఆరోగ్యం లో ప్రతికూల ప్రభావాన్ని చూపడం
➼ నిరాశ,నిస్పృహ లాంటి భావనలకు లోను కావడం

ఎంత మొత్తంలో దూమపానాన్ని వినియోగిస్తున్నారు...???

➼ ధూమపానం వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 8మిలియన్ ప్రజలు చనిపోతున్నారు.
➼ 7మిలియన్ ప్రజలు టొబాకో ప్రభావం వాళ్ళ నేరుగా చనిపోతున్నారు .
➼ భారత దేశం లో మొట్ట మొదటగా 1887లో గౌహర్ డే బహ పేరుతో సిగరెట్స్ తాయారు చేసారు.
➼ భారత దేశంలో 267మిలియన్ టొబాకో వినియోగదారులు ఉన్నారు.
➼ ప్రపంచంలో రెండవ అతిపెద్ద టొబాకో వినియోగ దేశం మనది.
➼ భారతదేశంలో ఎక్కువ ధూమపానం కలకత్తా లో కలదు ఇక్కడ 100 మంది పురుషులలో 82 మంది & 100 మంది స్త్రీ లలో 23.5 మంది ధూమపానం చేస్తున్నారు.
➼ ఉత్తరప్రదేశ్ ఎక్కువగా టొబాకో వినియోగాన్ని కలిగి ఉంది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

ధూమపానం వాళ్ళ వచ్చే వ్యాధులు...??

➼ క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, శ్వాస సంబంధ వ్యాధులు, మధుమేహం, కంటి సంబంధిత వ్యాధులు వస్తాయి. రోగ నిరోధక శక్తి నశిస్తుంది.

➼ పెదవులు, నాలుక, నోరు, ముక్కు, గొంతు, కడుపు, కాలేయం మూత్రపిండాలు, రక్తం, గర్భాశయం, ప్రత్యుత్పత్తి అంగాల పైన కాన్సర్ రావచ్చు.
➼ కౌమారదశ & పెద్ద వారిలో ఉబ్బసం వచ్చే ప్రమాదం ఉంది.
➼ ధూమపానం రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.
➼ ఇది గుండె, మెదడు, కాళ్ళు, రక్త ప్రసరణని అడ్డుకుంటుంది.
➼ రక్త ప్రసరణ జరగకపోతే పని చెయ్యని అవయవాలను తీసేస్తారు.

➼ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల బాక్టీరియా & వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
➼ ధూమపానం వల్ల చెవిలో రక్త ప్రసరణ స్తంభించి వినికిడి లోపం వస్తుంది.
➼ చూపుని కోల్పోయ అవకాశం కూడా ఉంది.
➼ ధూమపానం వల్ల సంతానోత్పత్తి సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
➼ అంధత్వానికి ప్రధాన కారణం ధూమపానం.

Also Read: ఇలా చేస్తే శరీర కొవ్వు కరుగుతుంది బాసూ!

#health-tips #smoking
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe