KBR Park: హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద భూమిలో నుంచి పొగలు రావడం కలకలం రేపింది. షార్ట్ సర్క్యూట్‌తో భూమిలో నుంచి పొగలు వచ్చాయి. ఒక్కసారిగా పొగలు రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అండర్‌గ్రౌండ్‌లో ఇటీవల 11KV కేబుల్ ను విద్యుత్‌శాఖ అధికారులు అమర్చారు. అండర్‌గ్రౌండ్‌లో రెండు కేబుల్ వైర్లు జాయింట్ కావడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండవచ్చని విద్యుత్ శాఖ అధికారుల అనుమానం వ్యక్తం చేశారు. కాగా భూమి నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో పార్క్ కు వచ్చిన వారు బయటకు పరుగులు తీశారు.
KBR Park: కేబీఆర్ పార్కులో భూమి నుంచి పొగలు.. పరుగులు తీసిన జనం!
TG: హైదరాబాద్‌లోని KBR పార్క్‌లో ఒక్కసారిగా భూమిలో నుంచి పొగలు బయటకు వచ్చాయి. దీంతో అక్కడ ఉన్న జనం భయబ్రాంతులకు గురయ్యారు.అండర్‌గ్రౌండ్‌లో ఇటీవల 11KV కేబుల్స్ వేశామని.. అవి షార్ట్ సర్క్యూట్ కావడంతో భూమిలో నుంచి పొగలు వచ్చాయని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు.
Translate this News: