Mobile Battery Life Increase: ఈ సెట్టింగ్స్‌ని మారిస్తే మీ మొబైల్ బ్యాటరీ మరింత సమయం వస్తుంది.. సూపర్ టిప్స్ మీకోసం..

చాలా రోజులుగా మీ స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయకపోతే.. దాని బ్యాటరీలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ ఆప్షన్‌లోకి వెళ్లడం ద్వారా దీని సెట్ చేయొచ్చు. దీంతో బ్యాటరీ హీటింగ్, ఛార్జింగ్ కాకపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. మరి బ్యాటరీ ఎక్కువసేపు ఉండేలా చేయడానికి ఏ టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Mobile Battery Life Increase: ఈ సెట్టింగ్స్‌ని మారిస్తే మీ మొబైల్ బ్యాటరీ మరింత సమయం వస్తుంది.. సూపర్ టిప్స్ మీకోసం..
New Update

Mobile Battery Life Increase: వినియోగించేకొద్ది ఏ వస్తువు అయినా.. పాతదిగా మారుతుంది. ముఖ్యంగా మొబైల్(Smart Phone) విషయంలో ఇది వర్తిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నా కొద్ది.. పాతదిగా మారుతుంది. దాని బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఫలితంగా వెంట వెంటనే ఫోన్ ఛార్జింగ్(Charging) డౌన్ అయిపోతుంటుంది. పదే పదే ఛార్జింగ్ పెట్టలేక విసిగిపోతుంటారు మొబైల్ యూజర్లు. అయితే, ఈ సమస్య నుంచి ఉపశమనం పొందే అద్భుతమైన.. టిప్స్ మీకోసం తీసుకువచ్చాం. ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్ కొత్త ఫోన్ మాదిరిగా పని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంకేతిక నిపుణుల ప్రకారం.. మొబైల్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ పోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. మొబైల్ కొన్న కొత్తలో ఎలాగైతే బ్యాటరీ పనితీరు ఉందో.. ఆ సెట్టింగ్స్ మార్చిన తరువాత అంతే స్థాయిలో వర్క్ అవుతుందని చెబుతున్నారు.

ఇలా సమస్యను పరిష్కరించవచ్చు..

చాలా రోజులుగా మీ స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయకపోతే.. దాని బ్యాటరీలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ ఆప్షన్‌లోకి వెళ్లడం ద్వారా దీని సెట్ చేయొచ్చు. దీంతో బ్యాటరీ హీటింగ్, ఛార్జింగ్ కాకపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. మరి బ్యాటరీ ఎక్కువసేపు ఉండేలా చేయడానికి ఏ టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అవసరం లేని యాప్స్‌ని వెంటనే డిలీట్ చేయండి..

చాలా సార్లు మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఉపయోగం లేని కొన్ని యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తుంటారు. అలాంటి వాటిని వెంటనే తొలగించాలి. ఈ యాప్‌ల కారణంగా.. బ్యాటరీపై భారం పడుతుంది. ఫలితంగా బ్యాటరీ ఛార్జింగ్ పదే పదే వేగంగా తగ్గిపోతుంది. చివరకు బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. అందుకే.. ముందుగా మీ మొబైల్‌లో ఉన్న అవసరం లేని యాప్స్‌ని వెంటనే తొలగించేయండి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్..

సాధారణంగా, చాలా మంది ప్రజలు తమ స్మార్ట్‌ ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయరు. దీని కారణంగా కూడా బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. మొబైల్ తయారీ కంపెనీలు.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో బ్యాటరీని పెంచే అప్‌డేట్స్‌ని కూడా ఇస్తాయి. మీ పాత్ స్మార్ట్‌ఫోన్‌లలోని సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తే.. అది బ్యాటరీకి కొత్త లైఫ్‌ని ఇస్తుంది.

ఫుల్ ఛార్జింగ్..

మీ ఫోన్ ఛార్జింగ్‌ను ఎప్పుడూ పూర్తిగా తగ్గే వరకు ఉంచకూడదు. మినిమం 90 శాతం వరకు చార్జింగ్‌ను ఎల్లప్పుడూ మెయింటేన్ చేస్తుండాలి. ఇక కొందరైతే.. రోజంతా తమ మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు. రాత్రి పడుకునే ముందు మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టి.. మరుసటి రోజు ఉదయం వరకు అలాగే ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు. దాంతో.. మొబైల్ బ్యాటరీ లైఫ్ పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే.. ఎప్పుడూ ఇలాంటి పని చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.

Also Read:

టీడీపీ-జనసేన పొత్తు లాభమా…నష్టమా…ఎవరి వాటా ఎంత?

Asia Cup: రేపే బిగ్‌ ఫైట్‌.. గెలుపు ఎవరిది.!

#smart-phone-tips #mobile-battery-life #battery-life-increase #mobile-battery #smart-phone-caring-tips #settings-change-in-mobile
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe