Smart Phone Prices: స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగే ఛాన్స్.. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మెమరీ చిప్ ధరలు పెరగడంతో స్మార్ట్ ఫోన్ ధరలు కూడా పెరగొచ్చని అంటున్నారు. అయితే, బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్స్ పై దిగుమతి సుంకం తగ్గించారు. చిప్ ధరల పెరుగుదల పెద్దగా ప్రభావం చూపించదని కూడా ఒక వాదన వినిపిస్తోంది. By KVD Varma 06 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Smart Phone Prices May Rise: మెమరీ చిప్ ధరల పెరుగుదల - చైనీస్ యువాన్ బలపడటం వల్ల స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగవచ్చు. అయితే, మధ్యంతర బడ్జెట్‌కు ముందు మొబైల్ ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని ఇటీవల తగ్గించడం వల్ల ధరలు పెద్దగా పెరగవని పరిశ్రమ అధికారులు చెబుతున్నారు. మార్కెట్ పరిశోధకుడు ట్రెండ్‌ఫోర్స్ మాట్లాడుతూ, DRAM (మెమరీ చిప్స్) కు సంబంధించి ఇద్దరు ప్రధాన సరఫరాదారులు ఉన్నారు - Samsung అలాగే Micron. ఇవి రెండూ కూడా చిప్ ధరలను పెంచబోతున్నాయి. దీంతో మార్చి త్రైమాసికంలో మెమరీ చిప్‌ల (Memory Chips) ధరలు 15-20 శాతం పెరిగే అవకాశం ఉంది. తక్కువ సరఫరా కారణంగా 2024లో DRAM ధరలు పెరగవచ్చు. ఎక్కువ ఇన్వెంటరీ ఉన్న ఉత్పత్తుల కాంట్రాక్ట్ ధర 3-8 శాతం మాత్రమే పెరుగుతుందని ట్రెండ్‌ఫోర్స్ జనవరి 1 నివేదికలో పేర్కొంది. దీనికి విరుద్ధంగా, కొరత ఉన్న ఉత్పత్తుల కాంట్రాక్ట్ ధర 5-10 శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా. పలు జాతీయ వెబ్సైట్స్ లో వచ్చిన వార్తల ప్రకారం, చాలా మంది విక్రేతలు మార్చి త్రైమాసికంలో తగినంత ఉత్పత్తులను కలిగి ఉన్నందున వచ్చే త్రైమాసికం నుండి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆ వార్తల ప్రకారం, ఫిబ్రవరి మూడవ వారం నుండి మార్చి మొదటి వారం వరకు అధిక డిమాండ్ కారణంగా, మెమరీ ధరలు 10-15 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే, ప్రతి కంపెనీ ధరలను పెంచవలసి ఉంటుంది. అయితే ఇటీవలి దిగుమతి సుంకంలో (Import Tax) తగ్గుదల ధరలను తగ్గించడంలో సహాయపడవచ్చు. Also Read: పనికిరావన్న వారితోనే పల్లకీ మోయించుకున్న గానలత చైనీస్ కరెన్సీ యువాన్ (Yuan) బలపడటంతో మొబైల్ ఫోన్ విడిభాగాలు కూడా ఖరీదైనవిగా మారాయి. భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు చైనీస్ భాగాలపై (China Parts) ఆధారపడి ఉంటాయి. ఈ తయారీదారులు నేరుగా వారి స్థానిక కరెన్సీ యువాన్‌లో లావాదేవీలు జరుపుతారు. అయితే అంతకుముందు వారు డాలర్ ధరలపై కూడా ఆధారపడవలసి ఉంటుంది. యువాన్ జూన్ 2023లో రూ. 11.32 కనిష్ట స్థాయి నుండి డిసెంబర్‌లో రూ. 12.08కి కోలుకుంది, ఇది 6.7% పెరుగుదలను సూచిస్తుంది. ఇది చైనీస్ భాగాలను దిగుమతి చేసుకునే బ్రాండ్‌లపై ప్రతికూల ప్రభావం చూపింది. కానీ ఇటీవలి డ్యూటీ తగ్గింపు, పెరుగుతున్న మారకపు రేట్ల రెట్టింపు దెబ్బ నుండి మెమరీ చిప్‌ల ధరలను కాపాడుతుందని అంచనా ఉంది. తుది ధరల పెరుగుదల డిమాండ్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉందని మార్కెట్ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, హ్యాండ్‌సెట్ ధరలను (Smart Phone Prices) పెంచే బదులు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో తక్కువ మెమరీ అలాగే స్టోరేజీని అందించడం బ్రాండ్‌లకు ఒక మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు. Watch this Interesting Video : #smart-phones #smart-phone-prices మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి