/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Small-movie-releases-with-BRO-jpg.webp)
ఓ పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చిన్న సినిమాలన్నీ తప్పుకుంటాయి. ఇది అత్యంత సహజం. అయితే పవన్ కల్యాణ్ విషయంలో అలా జరగడం లేదు. అతడు నటించిన బ్రో సినిమాతో పాటు.. స్లమ్ డాగ్ హజ్బెండ్ అనే చిన్న సినిమా రిలీజ్ అవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దీనికి ఆ నిర్మాత చెప్పే రీజన్ భలేగా ఉంది.
బ్రో సినిమాకు మొదటి 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో హౌజ్ ఫుల్ బోర్డులు పడతాయంట. ఆ టైమ్ లో టికెట్ దొరకని ప్రేక్షకులంతా తమ సినిమాకు వస్తారని, ఆశపడుతున్నారు స్లమ్ డాగ్ హజ్బెండ్ మేకర్స్. వినడానికి కాస్త లాజికల్ గానే ఉన్నప్పటికీ, అంత నమ్మబుద్ధి కావడం లేదు.
పవన్ కల్యాణ్ సినిమా కోసం వచ్చిన ప్రేక్షకులు టికెట్ దొరక్కపోతే మరో సినిమాకు ఎందుకు వెళ్తారు.. డబ్బులెందుకు వేస్ట్ చేసుకుంటారు.. ఓ రోజు ఆగి బ్రో సినిమా చూస్తారు కదా. కానీ స్లమ్ డాగ్ హజ్బెండ్ మేకర్స్ మాత్రం తమ మాటమీదే ఉన్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తమ సినిమాను కూడా ఆదరిస్తారని చెబుతున్నారు.
బ్రో తో పాటు 28న థియేటర్లలోకి వస్తోంది స్లమ్ డాగ్ హజ్బెండ్. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు ఇందులో హీరోగా నటించాడు. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించింది