అయోధ్యాపూరిలోని శ్రీరామమందిరం (Sri Rama Mandir)ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం కోసం సిద్ధమవుతుంది. రామాలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ తో సహా 4,000మందికిపైగా వీఐపీలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మహత్తర వేడుకకు ముందు అయోధ్య(Ayodhya)ను అందంగా అలంకరిస్తున్నారు. నగరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.
13వేల అడుగుల ఎత్తులో నుంచి జై శ్రీరామ్:
ఈ నేపథ్యంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ కు చెందిన 22ఏళ్ల యువతి బ్యాంకాక్ లో 13వేల అడుగుల ఎత్తులో నుంచి జై శ్రీరామ్ (Jai Sriram)అని రాసి ఉన్న జెండాతో స్కైడైవింగ్(Skydiving) చేస్తూ అయోధ్యలోని రామమందిరంపై ఉన్న తన భక్తిని ప్రదర్శించింది. అనామిక శర్మ(Anamika Sharma) అనే 22 ఏళ్ల యువతి జనవరి 22న రామమందిర ప్రాంభోత్సవానికి ముందు ఈ స్టంట్ ప్రదర్శించింది. నేను నా మతాన్ని ప్రేమిస్తాను..నా మతాన్ని స్కైడైవింగ్ ను కలిసి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అంటూ అనామిక శర్మ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తొలి ఆహ్వాన పత్రం వీడియో వైరల్:
అటు జనవరి 22న శ్రీరామ మందిరంలో రాంలల్లాను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వాన పత్రాలు(Invitation Letters) పంపగా ఇప్పుడు తొలి ఆహ్వాన పత్రం వీడియో వైరల్ గా మారింది. ప్రాణ ప్రతిష్ఠ (Prana Pratishtha)కార్యక్రమంలో పలువురు వీవీఐపీలు పాల్గొననున్నారు. ఇప్పుడు దీని కోసం ఆహ్వాన లేఖలు కూడా పంపించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు. ఈ ఎరుపు రంగు కార్డుపై కుంకుమ రంగులో సందేశం రాసి ఉంది. ఈ ఆహ్వానపత్రంపై న్యూ గ్రాండ్ టెంపుల్ హోం(New Grand Temple Home)లో రామ్ లల్లా తన జన్మస్థానంలో తిరిగి వస్తున్నందుకు శుభ వేడుక అని పేర్కొన్నారు. ఈ కార్డులో రామమందిర నిర్మాణానికి సంబంధించి కాలక్రమేణ, దశల గురించి వివరాలను పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: కొత్త సంవత్సరంలో మహిళలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..ఆ స్కీమ్ పొడిగించే ఛాన్స్..?