Skin Care: బీట్‌రూట్‌ ఫేస్ ప్యాక్.. క్షణాల్లో కాంతివంతమైన, మెరిసే చర్మం..!

సాధారణంగా వేసవిలో చర్మం పొడిబారడం, ముఖం పై దద్దర్లు, మొటిమలు వంటి సమస్యలను గమనిస్తుంటారు. వేసవిలో చర్మ సంరక్షణ కోసం బీట్‌రూట్‌ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. బీట్రూట్ రసం, బాదం పాలు కలిపిన మిశ్రమాన్ని అప్లై చేయడం ద్వారా చర్మానికి పోషణ అందుతుంది.

Skin Care: బీట్‌రూట్‌ ఫేస్  ప్యాక్.. క్షణాల్లో కాంతివంతమైన, మెరిసే చర్మం..!
New Update

Skin Care: సాధారణంగా వేసవిలో రకరకాల చర్మ సమస్యలు వస్తాయి. విపరీతమైన ఎండ , దుమ్ము, ధూళి కారణంగా, కొంతమందికి ముఖం మీద దద్దుర్లు వస్తాయి. మరి కొందరికి మొటిమలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చర్మ సంరక్షణ పట్ల అజాగ్రత్తగా ఉండడం వల్ల అకాల వృద్ధాప్య ఛాయలకు దారితీసే ప్రమాదం ఉంది. అయితే వేసవిలో పాడైన చర్మాన్ని సంరక్షించడానికి ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసే బీట్ రూట్ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పని చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము..

పొడి చర్మాన్ని ఎలా ఎక్స్‌ఫోలియేట్ చేయాలి

పొడి చర్మానికి ఎక్కువ పోషణ అవసరం. అటువంటి పరిస్థితిలో, బీట్‌రూట్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీ చర్మానికి పోషణ, ఎక్స్‌ఫోలియేట్, తేమను అందిస్తుంది.

బీట్‌రూట్‌ ఫేస్ ప్యాక్ చేయడానికి కావలసినవి

  • 2 టేబుల్ స్పూన్లు బీట్రూట్ రసం
  • 4 నుంచి 5 చుక్కల బాదం పాలు

ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి

బీట్ రూట్ ఫేస్ తయారు చేయడానికి ఉండగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు బీట్రూట్ రసం, 4 నుంచి 5 చుక్కల బాదం పాలు
వేసి బాగా కలపాలి. తర్వాత స్మూత్ బ్రష్ సహాయంతో ఈ మిశ్రమాన్ని మీ ముఖం మొత్తానికి సమానంగా అప్లై చేయండి. సుమారు 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి.

publive-image

వృద్ధాప్య సమస్యను నివారించే బీట్ రూట్ ఫేస్ ప్యాక్

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా బీట్‌రూట్ ఫేస్ ప్యాక్‌ ఉపయోగపడుతుంది. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ సి చర్మ కణాలను ఉత్పత్తి , పునరుత్పత్తి చేయడంలో, ముడతలు, ఫైన్ లైన్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ప్యాక్ చేయడానికి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము.

  • 1 టేబుల్ స్పూన్ తేనె
  • సగం బీట్‌రూట్

ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి

బీట్‌రూట్ తురుము లేదా దానిని మెత్తగా రుబ్బుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాలు వదిలివేయండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: High Cholesterol: పెరిగిన కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావాలంటే? ఈ 5 పనులు చేయండి!

#skin-care #beetroot-face-pack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe