నాపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారన్నారు ఫైర్ అయ్యారు చంద్రబాబు. నేనేమన్నా టెర్రరిస్టునా.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
నాపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారన్నారు ఫైర్ అయ్యారు చంద్రబాబు. నేనేమన్నా టెర్రరిస్టునా.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని న్యాయవాదులు కోరారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారో సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కనీసం ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు . అరెస్ట్ చేసేటప్పుడు తనకు ప్రాథమిక ఆధారాలు ఇవ్వాలి కదా అని పోలీసు అధికారులను నిలదీశారు. . 24 గంటలలో అన్ని ఇస్తామని పోలీసులు చెప్పినట్టు సమాచారం. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో బెజవాడలో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీడీపీ నేతల ఇళ్ళవద్ద పీకేట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తుతో పోలీస్ యంత్రాంగం పహారా ఏర్పాటు చేసింది..
గంటా అరెస్ట్:
మరోవైపు ఏపీలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో మాజీ మంత్రి గంటాతో సహా ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా గంటా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం నిర్వహణలో గంటా ప్రమేయంపై ఆరోపణలు ఉన్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కసులో 1గా చంద్రబాబును పేర్కొన్నారు. ఇటు గంటాను కూడా సీఐడీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్దంగా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం ఏర్పాటు చేశారన్నది గంటా పైన అభియోగం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల అరెస్టులపై గంటా శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు క్యాంప్ వద్ద అర్థరాత్రి హైడ్రామా చేయాలిసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అమరావతి భూముల కేసులో నా పేరు చేర్చారు. ఎన్ని విచారణలు జరిగినా నా ప్రస్తావన రాలేదన్నారు. ఓడిపోతానని జగన్ హీట్ తగలడంతో తనను తెరపైకి తెచ్చారని అన్నారు. ఏ కేసులైనా ఎదుర్కొవడానికి రెడీగా వున్నానని చెప్పారు గంటా శ్రీనివాస్. జగన్ జైలుకు వెళ్లారని అక్కసుతో.. చంద్రబాబును అరెస్ట్ చేయించినట్టు ఉందని గంటా అన్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని.. అతని లాగే అందర్నీ జైలుకు పంపించాలని ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు.
ALSO READ: చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు.. వీడియో..!