కీచక టీచర్లు.. స్కూల్ టాయిలెట్‌లో 6వ తరగతి బాలికను ఏం చేశారంటే? ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు టీచర్స్ లైగింక దాడికి పాల్పడిన ఘటన ఒడిశాలో కలకలం రేపింది. స్కూల్‌లో వాష్ రూమ్‌కు వెళ్లిన 11 ఏళ్ల అమ్మాయిపై అదే స్కూల్ హెడ్ మాస్టర్, మరో ఉపాధ్యాయుడు బలవంతంగా సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. By srinivas 11 Nov 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు టీచర్స్ లైగింక దాడికి పాల్పడిన ఘటన ఒడిశాలో కలకలం రేపింది. ఈ మేరకు నబరంగ్‌పుర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల అమ్మాయి టాయిలెట్ కోసం వాష్ రూమ్ వెళ్లింది. ఇది గమనించిన ఆ స్కూల్ హెడ్ మాస్టర్, మరో ఉపాధ్యాయుడు ఇద్దరూ కలిసి అదే గదిలోకి వెళ్లి ఆమెపై బలవంతంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భయంతో ఇంటికెళ్లిన విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ మేరకు నబరంగ్‌పుర్ ఎస్పీ రోహిత్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 7న బాలికపై అత్యాచారం జరిగింది. కానీ రెండురోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు కడుపులో నొప్పిరావడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగిందని గుర్తించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు అదేరోజు కుందేయి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక చెప్పిన వివరాల మేరకు పాఠశాల హెడ్‌మాస్టర్, మరో ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని విచారించాం. అనంతరం వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాం. ఇద్దరు ఉపాధ్యాయులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద పలు కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుతం బాలికకు నబరంగ్‌పుర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపిన పోలీసులు విద్యార్థిని కోలుకున్నాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. Also read : 14 గంటల్లో 800 సార్లు భూకంపం.. ఆ దేశంలో ఆగమాగం ఇదిలావుంటే.. ఈ భయానక ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒడిశా మానవహక్కుల కమిషన్.. నబరంగ్‌పుర్ జిల్లా మెడికల్ ఆఫీసర్ నుంచి నివేదిక కోరింది. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ నాలుగువారాల్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. బాలికకు సరైన వైద్య సదుపాయాన్ని కల్పించాలని స్పష్టం చేసింది. ఇక ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. మహిళలు, అమ్మాయిలపై రాష్ట్రంలో రోజురోజులకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటూ విమర్శలు చేస్తున్నారు. #sixth-class-student #was-assaulte #by-teacher #in-odisha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి