AC Tips: ఏసీలో ఎక్కువగా కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయా? నిజమేంటి?

ఎండాకాలంలో AC చల్లనిగాలి సౌకర్యవంతంగా వేడి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. కానీ గంటల తరబడి ఏసీలో కూర్చోవడం వల్ల గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతోపాటు అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఏసీ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
AC Tips: ఏసీలో ఎక్కువగా కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయా? నిజమేంటి?

Home Tips: ప్రస్తుతం ఎన్నడు లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతీ ఒక్కరూ ఏసీ ఉన్న రూమ్‌లల్లో ఉండిపోతారు. AC చల్లనిగాలి.. వేడి నుంచి ఉపశమనం కల్పిస్తుంది.. కానీ గంటల తరబడి ఏసీలో కూర్చోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎండలు వేడి నుంచి తట్టుకోలే ఉపశమనం కోసం కూలర్లు, ఏసీలను ఎక్కువగా తీసుకుంటారు. ఎండాకాలంలో చల్లటి గాలి ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. అంతే ఆరోగ్యానికి హానికరం నిపుణులు అంటున్నారు. ఎయిర్ కండిషనింగ్ తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. శ్వాసకోశంలో వాపు, సంక్రమణ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఓ నివేదిక ప్రకారం.. ఎయిర్ కండిషనింగ్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఎక్కువ సేపు ఏసీలో కూర్చోవడం వల్ల గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఎక్కువసేపు AC ఎదుట ఉంటే ఆరోగ్యానికి అనేక తీవ్రమైన సమస్యలు వస్తాయి. AC చల్లని గాలి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉంటుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఏసీలో ఎక్కువగా కూర్చోవడం వల్ల జరిగే పరిణామాలు:

  • ఎక్కువ సేపు ఏసీలో కూర్చోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. అదే సమయంలో.. చర్మంలో తేమ లేకపోవడం, తలనొప్పి, శరీరం నొప్పులు వంటి సమస్యలు వస్తాయి.
  • ఎక్కువసేపు ఏసీలో కూర్చోవడం వల్ల ఎముకల నొప్పి వస్తుంది. చల్లని గది వెలుపల సూర్యరశ్మికి గురికావడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు అధికంగా ఉంటాయి.
  • ఏసీలో ఉంంటే తలనొప్పి, డీహైడ్రేషన్, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి. ఇది మాత్రమే కాదు.. డీహైడ్రేషన్ కూడా ట్రిగ్గర్ కావచ్చు.
  • ఏసీలో ఉండడం వల్ల అలర్జీ, ఆస్తమా వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో AC శుభ్రంగా ఉంచితే ఇలా సమస్యలు రాకుండా ఉంటాయి.
  • ఏసీలో ఉండడం వల్ల ముక్కు, గొంతు, కళ్లలో తీవ్రమైన సమస్యలతోపాటు వాపు సమస్య ముక్కు లోపల వస్తుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చక్కెర ఆరోగ్యానికి సైలెంట్ కిల్లర్.. ఎంత తినాలో తెలుసుకోండి!

Advertisment
తాజా కథనాలు