కూర్చొని ఆఫీస్ పని చేయడం కన్నా.. పడుకొని చేయడం ఆరోగ్యానికి బెస్ట్ అంట.. ఎందుకంటే?

కూర్చొని పని చేయడం కంటే..పడుకోని పని చేసుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. యూరోపియన్‌ హార్ట్ జర్నల్‌ లో ఈ విషయం గురించి ప్రస్తావించారు. కూర్చుని పని చేయడం వల్ల గుండె జబ్బులు త్వరగా వచ్చే అవకాశాలున్నట్లు వారు వివరించారు.

కూర్చొని ఆఫీస్ పని చేయడం కన్నా.. పడుకొని చేయడం ఆరోగ్యానికి బెస్ట్ అంట.. ఎందుకంటే?
New Update

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కచ్చితంగా రోజులో 7 నుంచి 8 గంటల పాటు కూర్చునే పని చేస్తారు. అయితే ఇలా కూర్చొని పని చేయడం కంటే..పడుకోవడమే మేలు అంటున్నారు నిపుణులు. యూరోపియన్‌ హార్ట్ జర్నల్‌ లో ఈ విషయం గురించి ప్రస్తావించారు.

ఒక వ్యక్తి సగటున రోజుకి 9.30 గంటల సేపు కదలకుండానే కూర్చుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని వల్ల గుండె జబ్బులు త్వరగా వచ్చే అవకాశాలున్నట్లు వారు వివరించారు. ఇలా కూర్చునే బదులు నిలబడినా, కనీసం పడుకున్నా గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తేల్చారు.

సుమారు ఐదు దేశాల్లోని ఆరు అధ్యయానాలను పరిశీలించి ఈ విషయాలను తెలిపారు. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారిలో గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు నిపుణులు వివరిస్తున్నారు. ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే హాని చేస్తుంది. దీనికి బదులు ఐదు నిమిషాల సేపు తీవ్రమైన లేదా ఓ మాదిరి శ్రమ చేసినా మంచి ఫలితం కనిపిస్తోందని పరిశోధకులు వివరించారు.

కనీసం నిలబడినా..ఆ మాటకొస్తే పడుకున్నా కూడా కూర్చోవటం కన్నా మెరుగైన ఫలితం చూపిస్తోందని వివరిస్తున్నారు. కూర్చోవటానికి బదులు అరగంట సేపు వ్యాయామం చేసిన వారిలో ఎత్తు, బరువు 2.4 శాతం తగ్గినట్లు తేలింది. అలాగే రక్తపోటు, గ్లూకోజు, ఒంట్లో కొవ్వు, కొలెస్ట్రాల్‌ మోతాదులు తక్కువగా ఉంటాయి. నిద్ర కూడా మంచిగా పడుతుంది.

Also read: ఒకే ట్రాక్ పైకి దూసుకొచ్చిన మూడు రైళ్లు..తప్పిన పెను ప్రమాదం!

#lifestyle
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe