AP Politics: రాష్ట్రంలో అల్లర్లు జరగడానికి కారణం ఇదే.. సిట్ సంచలన నివేదిక..!

రాష్ట్రంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో విచారణ చేసి సిద్ధం చేసిన నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ డీజీపీకి అందించారు. పోలీసుల నిర్లక్ష్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు గుర్తించారు.

AP Politics: రాష్ట్రంలో అల్లర్లు జరగడానికి కారణం ఇదే.. సిట్ సంచలన నివేదిక..!
New Update

Also Read: ఈసీ స్పెషల్ ఫోకస్.. ఈ జిల్లాలో పెట్రోల్ బంకులపై ఆరోజు వరకు ఆంక్షలు.!

ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో విచారణ చేసి సిద్ధం చేసిన నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ డీజీపీకి అందించారు. పోలీసుల నిర్లక్ష్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్లు గుర్తించారు. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈవో, సీఈసీకి ప్రాథమిక నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది.


Also Read: హైదరాబాద్ నుంచి తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీసులు హై అలర్ట్..!

అయితే, పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ గడువు కోరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2 రోజుల పాటు 3 జిల్లాల్లోని బాధితులు, రాజకీయనేతలు, స్థానికులు, పోలీసులను సిట్ బృందాలు విచారించాయి. తాడిపత్రిలో పోలింగ్ రోజు గొడవ జరిగిన ప్రాంతాల్ని పరిశీలించిన సిట్ బృందం.. ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, సీసీ కెమెరాల ద్వారా అల్లర్లకు కారణమైన వారి గుర్తించారు.

#ap-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe