Siri Hanmanth : బాయ్ ఫ్రెండ్ తో సిరి హన్మంత్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. పార్టీలో 'బేబీ' డైరెక్టర్

బిగ్ బాస్ బ్యూటీ సిరి ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ పార్టీలో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పాటు 'బేబీ' డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

New Update
Siri Hanmanth : బాయ్ ఫ్రెండ్ తో  సిరి హన్మంత్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. పార్టీలో 'బేబీ'  డైరెక్టర్

Siri Hanmanth :  యూట్యూబ్(YouTube) సీరీస్, సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న సిరి(Siri) బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss Season 5) లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తరువాత సిరికి ఫుల్ నెగెటివిటీ తో పాటు పాపులారిటీ కూడా బాగానే వచ్చింది. సీజన్ 5 లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.

publive-image

గత కొన్నాళ్ళు గా సిరి, శ్రీహన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్(Shrihan), ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి గ్రాండ్ గా బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకుంది. ఈ పార్టీలో బిగ్ బాస్ ఫేమ్ కాజల్(Kajal), బేబీ డైరెక్టర్ సాయి రాజేష్(Baby Director Sai Rajesh) కూడా ఉన్నారు. తన బర్త్ డే(Birth Day) ఫొటో లను సిరి తన సోషల్ మీడియా(Social Media) వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

Also Read: Shivani Rajashekar: ఉప్పెనలో ఆ సీన్స్ నచ్చకే ఆఫర్ వదులకున్న.. రెండేళ్ల తర్వాత బయటపెట్టిన శివాని!

publive-image

బిగ్ బాస్ తరువాత సినిమాలు, వెబ్ సీరీస్ లు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉంది సిరి. యు ట్యూబ్ లో సిరి.. మేడమ్ సార్.. మేడమ్ అంతే, గందరగోళం, రామ్‌లీలా సీరిస్‌ లలో తన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో కలిసి నటించింది. కెరీర్ మొదట్లో ఎవరే నువ్వు మోహిని, అగ్ని సాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్స్ తో ప్రేక్షకులను బాగా మెప్పించింది.

publive-image

ప్రస్తుతం సిరి పాపులర్ కామెడీ షో జబర్దస్త్(Jabardasth) యాంకర్ గా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో కూడా మంచి అవకాశాలు కొట్టేసింది. ఇటీవలే సిరి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాలో ఒక పాత్రలో కనిపించింది. అలాగే ఓటీటీ లో విడుదలైన 'పులి మేక' వెబ్ సీరీస్ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ బ్యూటీ ఎప్పటి కప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాల్ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.

publive-image

Also Read: Guntur Kaaram: గుంటూరు కారంలో సూపర్ స్టార్ కృష్ట.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు నిజంగా సంక్రాంతే!

Advertisment
తాజా కథనాలు