టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి..!! అసలు విషయం ఏంటంటే..? టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ నెటిజన్స్ పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నారు. హల్దీ ఫంక్షన్ లో ఉన్న ఆమె ఫొటోలను షేర్ చేస్తూ.. రెండో పెళ్లి చేసుకోబోతోందని ఫేక్ న్యూస్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు . ఇక అసలు విషయం ఏంటంటే.. ఆ ఫొటోలు శ్రావణ భార్గవి సోదరుడు హరీష్ హల్దీ ఫంక్షన్ లోనివి. By Jyoshna Sappogula 18 Sep 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ నెటిజన్స్ పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నారు. హల్దీ ఫంక్షన్ లో ఉన్న ఆమె ఫొటోలను షేర్ చేస్తూ.. రెండో పెళ్లి చేసుకోబోతోందని ఫేక్ న్యూస్ ను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. అయితే, సింగర్ శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రావణ భార్గవి పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సింగర్ గా ఇప్పటికీ మంచి ఆఫర్లతో శ్రావణ భార్గవి కెరీర్ ను కొనసాగిస్తున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా శ్రావణ భార్గవి పాపులారిటీని మరింత పెంచుకున్నారు. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే సింగర్ హేమచంద్రతో ప్రేమలో పడి.. వివాహం కూడా చేసుకుంది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. 2013 సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట.. త్వరలోనే అధికారికంగా విడాకులు తీసుకునే ఛాన్స్ ఉందని అనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. హేమచంద్ర శ్రావణ భార్గవి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను హేమచంద్ర శ్రావణ భార్గవి ఖండించడం జరిగింది. అయితే తాజాగా శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోనున్నరని కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు. హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఆ ఫొటోలు శ్రావణ భార్గవి సోదరుడు హరీష్ హల్దీ ఫంక్షన్ లోనివి. 2022 ఫిబ్రవరిలో జరిగిన ఈవెంట్ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ చేస్తూ.. ఆమె రెండో పెళ్లి అంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం తెలుసుకున్న అభిమానులు ఇంత నీచంగా ఎలా ప్రచారం చేస్తారంటూ ఫైర్ అవుతున్నారు. Also Read: క్లీంకారతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వినాయకచవితి సెలబ్రేషన్స్..!! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి