Amma Paata 2024 : అమ్మపాట.. అందరి నోట.. ఎన్ని మిలియన్ల వ్యూసో తెలుసా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సింగర్ జాన్వీ పాడిన అమ్మ పాటే వినిపిస్తోంది, కనిపిస్తోంది. 'అమ్మ పాడే జోల పాట' అంటూ మధురమైన గాత్రంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ పాట. మిలియన్స్ పైగా వ్యూస్ తో దుమ్మురేపుతోంది. ఈ పాట పాడిన జాన్వీ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

New Update
Amma Paata 2024 : అమ్మపాట.. అందరి నోట.. ఎన్ని మిలియన్ల వ్యూసో తెలుసా?

Singer Jahnavi Amma Paata 2024 : సోషల్ మీడియా (Social Media) కు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ రోజుల్లో టాలెంట్ (Talent) ప్రదర్శించేందుకు కొదవే లేదు. ఒకప్పుడు టీవీల్లో, సినిమాల్లో కనిపిస్తేనే టాలెంట్ ను గుర్తిస్తారు అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు అనే స్థాయికి వచ్చింది. సోషల్ మీడియా చలవ వల్ల అనామకులు సైతం ట్రెండ్ అవుతున్నారు. ఎంతో మంది కొత్త కొత్త కంటెట్లు, కాన్సెప్టులతో వీడియోలు చేస్తూ యూట్యూబర్లుగా, ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా (Instagram Influencers) రాణిస్తున్నారు. టాలెంట్ ఉంటే సోషల్ మీడియాలో ఒక్క వీడియో, ఒక్క పాటతో కూడా ఓవర్ స్టార్ అయిపోతుంటారు.

అమ్మ పాటకు

ఇప్పుడు అలాంటి ఒక పాటతోనే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి మరెవరో కాదు సింగర్ జాన్వీ (Singer Jahnavi). ఇటీవలే జాన్వీ పాడిన అమ్మ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఎక్కడ చూసిన ఈ అమ్మ పాటే వినిపిస్తోంది, కనిపిస్తోంది. ‘అమ్మ పాడే జోల పాట.. అమృతం కన్నా తియ్యనంట. అమ్మ పాడే లాలి పాట..తేనెలోరే పారే యేరులంట' అంటూ మధురమైన గాత్రంతో నెట్టింట ట్రెండ్ అవుతోంది ఈ పాట. యూట్యూబ్ లో 1 మిలియన్ పైగా వ్యూస్ తో దుమ్మురేపుతోంది.

సింగర్ జాన్వీ

ఇలాంటి మనస్సుకు హత్తుకునే పాట పాడిన జాన్వీ మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. తెలుగు రాని ఈ అమ్మాయి తెలుగులో అమ్మ ప్రేమను అద్భుతంగా వర్ణిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈమెకు ఇన్ స్టాలో 13 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పాటను సురేందర్ మిట్టపల్లి రాయగా, సిస్కో డిస్కో సంగీతం అందించారు. అమ్మ పాటను మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా పాడిన జాన్వీని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Also Read: Song: ఇంకా దుమ్ములేపుతోన్న సీమ దసర సిన్నోడు సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయో తెలుసా?