Singer Chinmay: ఇండియాలోనే ఇలా జరిగింది.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్!

జార్ఖండ్ లో అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ ఇష్యూపై సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్ చేసింది. 'దేశవిదేశాలు తిరిగినా ఆమెకు ఎలాంటి హాని జరగలేదు. కానీ ఇండియాలో ఈ దారుణం జరగడం బాధకరం' అంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.

New Update
Singer Chinmay: ఇండియాలోనే ఇలా జరిగింది.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్!

Singer Chinmay: టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్ కన్నడలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ కు ఈమె డబ్బింగ్ చెప్పింది. అంతే కాదు సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో పాటలు పాడిన చిన్మయి.. తన వాయిస్ తో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. గత కొంత కాలంగా పాటలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సామాజిక అంశాలు పై ఈమె చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా ఆడవారికి సంబంధించి ఏదైనా తప్పు జరిగినా, ఎవరైనా తప్పుగా మాట్లాడిన వెంటనే స్పందిస్తుంది చిన్మయి.

Also Read: National: స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం.. సోషల్ మీడియాలో భర్త ఆవేదన!

స్పానిష్ మహిళ రేప్ పై చిన్మయి సంచలన కామెంట్స్

అయితే తాజాగా ఓ స్పానిష్ మహిళ రేప్ ఘటన పై ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక గా మారాయి. అసలు ఏం జరిగిందంటే..? ఓ స్పానిష్ మహిళ తన భర్తతో కలిసి బైక్ ట్రావెలింగ్ చేస్తూ భారత్ కు వచ్చింది. ఈ క్రమంలో ఆమె పై గ్యాంగ్ రేప్ జరగడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని పై సింగర్ చిన్మయి స్పందిస్తూ.. "ఆమె దేశ విదేశాలు తిరుగుతూ ఇండియా వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, అరబ్ కంట్రీస్ ఇలా పలు దేశాలు వెళ్ళింది. కానీ భారతదేశంలో ఏం జరిగింది. ఏడుగురు కలిసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు అంటూ సంచలన కామెంట్స్ చేసింది". ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.

Also Read: Nayanthara: నయనతార విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భర్త విఘ్నేష్ ..!

Advertisment
తాజా కథనాలు