తెలంగాణ ఉద్యమకారుడిగా, కళాకారుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏపూరి సోమన్నకు (Apoori Somanna) 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ (KCR) సర్కార్ సంస్కృతిక సారధిలో ఉద్యోగం ఇచ్చింది. ఆ ఉద్యోగాన్ని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు సోమన్న. 2018 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. తన ఆట పాటలతో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే.. అనూహ్యంగా షర్మిల వైఎస్సార్టీపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు.
ఇది కూడా చదవండి: Thatikonda Rajaiah: రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు
కానీ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సద్ధం అవుతున్న సమయంలో ఆయన పార్టీని వీడి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ప్రచార సభల్లో ఆడి పాడారు. అయితే.. బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో సోమన్న మళ్లీ కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం సాగింది. అయితే.. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ లలో సోమన్న కనిపించడంతో ఆ ప్రచారానికి కాస్త బ్రేక్ పడింది.
కానీ.. అనూహ్యంగా ఈ రోజు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరిపోయారు సోమన్న. అయితే.. సోమన్న బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ను ఆశించినట్లు తెలుస్తోంది. టికెట్ దక్కకపోవడంతోనే ఆయన ఆ పార్టీని వీడారన్న చర్చ సాగుతోంది.