Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రముఖ సింగరేణి సంస్థలో 173 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు సంస్థ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

New Update
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి శుభవార్త చెప్పింది. 173 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఖాళీల వివరాలు..
మొత్తం 173 ఖాళీల్లో జూనియర్ మైనింగ్ ఆఫీసర్ 87, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ పోస్టులు 11, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ 28 తదితర పోస్టులు ఉన్నాయి.

అధికారిక వెబ్ సైట్:https://scclmines.com/

ఈ వార్త అప్డేట్ అవుతోంది..

Advertisment
తాజా కథనాలు