Ananthapuram: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైసీపీలో గత కొన్ని రోజులుగా అంతర్గతంగా రగులుతున్న వర్గపోరు ఒక్కసారిగా పెల్లుబుకింది. ప్రభుత్వ విద్యా సలహాదారుడు, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు విరుచకపడ్డారు.పైగా ఇటీవల సాంబ అనుచరుడిగా ఉన్న వీరాంజినేయులను నియోజకవర్గ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడం వారిని మరింత ఆగ్రహానికి గురి చేసింది.
Also Read: సీఎం జగన్ ఇందుకే మరోసారి సిద్ధం అంటున్నాడు: టీడీపీ నేత నజీర్
అనంతపురంలోని ఓ భవనంలో ఎమ్మెల్యే అసమ్మతి వర్గం నాయకులు భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలో గుర్తింపు లేని వ్యక్తికి ప్రాధాన్యత కల్పించేలా సాంబశివారెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు. శింగనమల నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉందని ముఖ్యమంత్రి జగన్ దీనిని గమనించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని మాట్లాడారు. సాంబశివారెడ్డి చెప్పే ఏ వ్యక్తిని తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
Also Read: స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ
పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి ప్రధాన్యత ఇవ్వాలని డిమాండ్ పై త్వరలో సీఎం జగన్ ని కలుస్తామని చెప్పారు. అధిష్టానం తమ నిర్ణయాన్ని కాదని సాంబశివారెడ్డికే పట్టం కట్టాలని చూస్తే టీడీపీ అభ్యర్థి శ్రావణి 60వేల మెజార్టీతో గెలుస్తారని అన్నారు. ఇన్ని రోజులు ఎమ్మెల్యేతో పాటు ఆమె భర్త సాంబశివారెడ్డి, వారి కుటుంబ సభ్యులు వ్యవహించిన తీరు మీద ఒక రేంజ్ లో విరుచకపడ్డారు.