Sleeping Tips: మంచి నిద్ర కోసం సింపుల్ టిప్స్.. ఇవి పాటిస్తే హ్యాపీగా నిద్రపోతారు!

రోజంతా శారీరకంగా, మానసికంగా యాక్టీవ్ గా ఉండడానికి రాత్రి సమయాల్లో సరైన నిద్ర తప్పనిసరి. మంచి నిద్ర కోసం గది ఉష్ణోగ్రతను 15-19 డిగ్రీల మధ్యలో ఉంచండి. పడుకునే ముందు స్నానం చేయండి. మీ నిద్రకు ఒక షెడ్యూల్ అలవాటు చేసుకోవడం చాలా మంచిది.

New Update
Sleeping Tips: మంచి నిద్ర కోసం సింపుల్ టిప్స్.. ఇవి పాటిస్తే హ్యాపీగా నిద్రపోతారు!

Sleeping Tips: రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి. కొంత మంది పనుల్లో జిజీగా ఉంటూ, మరి కొంత మంది రాత్రుళ్ళు ఫోన్స్ చూస్తూ నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఇవి మాత్రమే కాదు ఈ మధ్య కాలం చాలా మంది నిద్రలేమి సమస్యతో భాదపడుతున్నారు. ఒత్తిడి, టెన్షన్స్, డిప్రెషన్ ఈ సమస్య పై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. దీని కారణంగా చాలా మంది నాణ్యమైన నిద్ర కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రోజంతా శారీరకంగా, మానసికంగా యాక్టీవ్ గా ఉండడానికి రాత్రి సమయాల్లో సరైన నిద్ర తప్పనిసరి. కావున నాణ్యమైన నిద్ర కోసం ఈ సింపుల్ టిప్స్ పాటించండి..

మంచి నిద్ర కోసం సింపుల్ టిప్స్

రూమ్ టెంపరేచర్

మనం పడుకునే గది వాతావరణం, ఉష్ణోగ్రతలు కూడా నిద్ర పై ప్రభావం చూపుతాయి. మంచి నిద్ర కోసం గది ఉష్ణోగ్రతను 15-19 డిగ్రీల మధ్యలో ఉంచండి. రూమ్ టెంపరేచర్ మరీ చల్లగా, మరీ ఉక్కపోతగా ఉంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఉష్ణోగ్రతను మీడియంగా ఉంచేందుకు ప్రయత్నించండి.

పడుకునే ముందు స్నానం చేయడం

సహజంగా పడుకునే ముందు స్నానం చేస్తే హాయి నిద్రను ఇస్తుందని చెబుతారు. ఇది నిజమే రాత్రి సమయాల్లో పడుకునే ముందు వేడి నీళ్లతో స్నానం చేస్తే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ చిట్కా నిద్రలేమి సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

రెగ్యులర్ టైమింగ్స్

మీ నిద్రకు ఒక షెడ్యూల్ అలవాటు చేసుకోవడం చాలా మంచిది. రోజు 8-9 గంటల పాటు నిద్రపోయేలా మీ టైమింగ్స్ సెట్ చేయండి. దీని వల్ల రోజూ అదే సమయానికి మీ బ్రెయిన్ పడుకోవాలని సిగ్నల్ వెళ్తుంది. ఇది ప్రతీ రోజూ సరైన నిద్రకు తోడ్పడుతుంది.

publive-image

Also Read: Palmyra Sprout: తాటి తేగలు తింటే.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..!

ఆహారపు అలవాట్లు

పడుకునే ముందు చాక్లెట్, మసాలా ఫుడ్స్, కెఫిన్ కంటెంట్ ఫుడ్స్ అసలు తినకూడదు. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి. కెఫిన్ కంటెంట్ చాలా సమయం వరకు మెలకువగా ఉండేలా చేస్తుంది. అందుకని రాత్రి సమయాల్లో పాలు, పండ్లు, ఆకుకూరలు వంటి ఆహారాలు తినడం మంచిది.

యోగ, మెడిటేషన్

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ నిద్రలేమి సమస్యకు ముఖ్య కారణం. వీటిని తగ్గించడానికి ప్రతీ రోజు వ్యాయామం, యోగ, మెడిటేషన్ చేస్తే మంచి ప్రభావం ఉంటుంది. ఇవి నిద్రకు భంగం కలిగించే మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గించి నాణ్యమైన నిద్రకు సహాపడుతుంది.

చీకటి గది

సాధారణంగా వెలుతురుగా ఉంటే చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టదు. ఎందుకంటే నిద్రకు కావాల్సిన మెలటోనిన్ హార్మోన్ చీకటిగా ఉన్నప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతుంది . అందుకని పడుకునే ముందు లైట్స్ ఆఫ్ చేసి.. గది చీకటిగా ఉంచడానికి ప్రయత్నించండి. అంతే కాదు చీకటిగా ఉన్నప్పుడు ఫోన్ అస్సలు చూడకూడదు. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ కంటి ఆరోగ్యంతో పాటు నిద్రకు కూడా భంగం కలిగిస్తుంది.

publive-image

Also Read: Skin Fasting: స్కిన్ ఫాస్టింగ్.. ఎప్పుడైనా విన్నారా..? దీంతో మీ చర్మం మరింత యవ్వనం

Advertisment
తాజా కథనాలు