Sweating: వేసవిలో చెమట వాసన ఎక్కువైందా..? ఈ సింపుల్ టిప్స్ పాటించండి

వేసవిలో చెమట వాసన తరచుగా ఇబ్బంది పెడుతుంది. అటువంటి పరిస్థితిలో, కేవలం డియో లేదా పెర్ఫ్యూమ్ మాత్రమే సరిపోదు. శరీర దుర్వాసనను తొలగించడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Sweating: వేసవిలో చెమట వాసన ఎక్కువైందా..? ఈ సింపుల్ టిప్స్ పాటించండి

Sweating: వేసవిలో విపరీతమైన చెమట, దాని ద్వారా వచ్చే దుర్వాసన చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా, ఇంట్లో పని చేయాలన్నా శరీర దుర్వాసన వల్ల అసౌకర్యంగా ఉంటుంది. కావున వేసవిలో, ఈ చిన్న చిట్కాలను పాటిస్తే శరీరాన్ని అన్ని వేళల ఫ్రెష్ గా ఉంచడానికి సహాయపడతాయి.

రెండు సార్లు తలస్నానం

వేసవిలో రోజుకు రెండుసార్లు తలస్నానం చేయడం వల్ల బ్యాక్టీరియా తొలగి, దుర్వాసన రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా వారానికి రెండు సార్లు తల స్నానం చేసేలా మీ దినచర్య ప్లాన్ చేసుకోవాలి.

తేలికపాటి సబ్బు

స్నానానికి ఎల్లప్పుడూ తేలికపాటి సబ్బునే వాడాలి. చాలా కఠినమైన సబ్బు సహజ నూనెలను దూరం చేస్తుంది. ఇది కూడా శరీర దుర్వాసనకు కారణం కావచ్చు. అలాగే స్నానం చేసే నీటిలో సహజసిద్ధమైన పొడి లేదా లిక్విడ్స్ కలపడం ద్వారా శరీరం నుంచి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది.

సహజమైన బట్టలు

వేసవి కాలంలో ధరించడానికి కాటన్, తేలికపాటి బట్టలు ఎంచుకోవాలి. టెర్రికాట్, పాలిస్టర్, నైలాన్ వంటి దుస్తులకు దూరంగా ఉండడం మంచిది. ఈ దుస్తులలో గాలి శరీరానికి చేరదు తద్వారా చెమటతో పాటు బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది దుర్వాసనకు కారణమవుతుంది.

ఆల్కహాల్ ఫ్రీ డియోడరెంట్

శరీరం లేదా బట్టలపై అప్లై చేయడానికి ఆల్కహాల్ ఫ్రీ డియోడరెంట్‌ని ఉపయోగించండి. అవి ఎక్కువ కాలం ఉండి.. మంచి సువాసనను ఇస్తాయి.

ఎక్స్‌ఫోలియేట్

రెండు మూడు రోజుల వ్యవధిలోచర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి చర్మాన్ని స్క్రబ్ చేయాలి. తద్వారా దుమ్ము, ధూళి, చెమట వల్ల డెడ్‌గా మారిన చర్మం శుభ్రం అవుతుంది. ఇది శరీరం నుంచి చెమట వాసనను దూరం చేస్తుంది.

హెయిర్ వాష్

చెమట.. చేతులు, పాదాలు ముఖంపై మాత్రమే కాకుండా జుట్టులో కూడా వస్తుంది. దీని వల్ల జుట్టు వాసన రావడం మొదలవుతుంది. అందుకని , వీలైతే, ప్రతిరోజూ జుట్టును వాష్ చేయాలి లేదా వారానికి రెండు మూడు సార్లు తల స్నానం చేయాలి. దాంతో జుట్టు నుంచి ఎలాంటి వాసన ఉండదు.

Also Read: Ice water Facial: మొహాన్ని ఐస్ వాటర్ లో పెడుతున్నారా..? అయితే జాగ్రత్త..!

Advertisment
Advertisment
తాజా కథనాలు