Mental Health Tips: బిజీ బిజీ గడిచే జీవితంలో ప్రతీ ఒక్కరి లైఫ్ లో టెన్షన్స్, ఒత్తిడి, ఆందోళన సహజంగా మారాయి. జీవన శైలి విధానాలు, మనం రోజు పాటించే అలవాట్లు మానసిక ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి రిలాక్స్ అవ్వడానికి ఖాళీ సమయంలో ఇంట్లోనే ఈ సింపుల్ టెక్నీక్స్ పాటిస్తే చాలు. ఇవి నెగటివ్ థాట్స్, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.
మెంటల్ హెల్త్ టిప్స్
మొక్కలకు నీళ్ళు పోయడం లేదా తోటపని చేయడం
ఏదైనా టెన్షన్స్ లేదా ఒత్తిడిగా అనిపించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండడానికి పచ్చని చెట్ల మధ్య ఉండడం, ఇంట్లోనే మొక్కలకు నీళ్ళు పోయడం, తోటపని చేస్తే మనసుకు కాస్త ప్రశాంత కలుగును. వాటి నుంచి వచ్చే స్వచ్ఛమైన ఆక్షిజన్, పచ్చదనం ఒత్తిడిని తగ్గించి రిలాక్స్ అయ్యేలా చేస్తాయి.
వంట చేయడం
చాలా మంది స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు లేదా కొంత సమయం రిలాక్స్ అవ్వడానికి వంట చేయడం ఒక హాబీగా ఎంచుకుంటారు. అంతే కాదు ఒంటరిగా ఉన్న సమయంలో నెగటివ్ ఆలోచనల నుంచి బయటకు రావడానికి కుకింగ్ చేస్తారు. దీని వల్ల మనసు కూడా కాస్త రిలాక్స్డ్ గా ఉంటుంది.
వ్యాయామం చేయండి
ప్రతీ రోజు ఒక దినచర్య ప్రకారం మన రోజు యాక్టివిటీస్ చేస్తే అది మానసిక , శారీరక ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపును. అంతే కాదు శారీరక శ్రమ చేయడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
ఇంటి పనులు చేయడం
ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చాలా మంది ఒంటరిగా ఫీల్ అవ్వడం లేదా ఏదో ఒక ఆలోచనలతో బాధపడడం, ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి సమయాల్లో మిమల్ని మీరు ఎంగేజింగ్ గా ఉంచుకోవడానికి ఇంటి పనులు చేయడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం వల్ల ఒత్తిడి నెగటివ్ ఆలోచనల నుంచి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
పెట్ తో ఆడుకోవడం
చాలా మంది స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి పెట్స్ తో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో ఉండే పెంపుడు జంతువులతో ఆడుకోవడం వాటికి ఫీడ్ చేయడం ఇవ్వన్నీ మనసుకు కాస్త రిలీఫ్ ను కలిగిస్తాయి.
Cardamom Health Benefits: ఏంటీ ఇలాచీతో ఇన్ని లాభాలా.. తప్పక తెలుసుకోండి..! - Rtvlive.com