Silk Smitha Birthday: కళ్ళతోనే కవ్వించిన నటి.. సినీ మాయగాళ్ల మోసాలకు జారిపోయిన సిల్క్!

కళ్ళతోనే అభినయించగలిగిన వారిలో సిల్క్ స్మిత ఒకరు. పేదరికం నుంచి ఎవరి అండాలేకుండా 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చి 10ఏళ్లలో 300 పైగా సినిమాల్లో నటించిన స్మిత.. తరువాత క్రమశిక్షణ కోల్పోయి జీవితాన్ని 36 ఏళ్లకే ఆత్మహత్యతో ముగించింది. సిల్క్ స్మిత పుట్టినరోజు ఈరోజు. 

New Update
Tollywood: ఇంటి నుంచి పారిపోయి.. స్టార్‌గా మారిన తెలుగమ్మాయి!

Silk Smitha Birthday: సినిమాలోకి రావాలంటే.. అదీ నటిగా చాలా కష్టమైన విషయం ఆరోజుల్లో. ఒకవేళ వచ్చినా.. నిలదొక్కుకోవడం ఇంకా కష్టం.. పోనీ, నిలదొక్కుకున్నా.. స్థాయిని కాపాడుకోవడం మరీ కష్టం. అందులోనూ గాడ్ ఫాదర్ లేకుండా సినిమాల్లో ఏ స్థాయిలోనైనా నెగ్గుకు రావడం అప్పట్లో ఎంతో కష్టంగా ఉండేది. అయితే, చాలా తక్కువమంది మాత్రం అలా వచ్చి.. ఇలా ఒక స్థాయిని సంపాదించుకుని.. దానిని అనుభవించే లోపే ప్రపంచం నుంచే మాయం అయిపోయారు. అటువంటి వారిలో సౌత్ ఇండస్ట్రీ నుంచి చెప్పాలంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సిల్క్ స్మిత. అవును.. కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించగలిగిన అతి తక్కువ మందిలో  ఆమె కూడా ఒకరు. ఒకటీ రెండు కాదు దాదాపు 300 పైచిలుకు సినిమాల్లో తక్కువ కాలంలోనే మెరిసింది అంటే ఆమె క్రేజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఒక దశలో ఆమె లేని సినిమా ఉండేది కాదు. అంత అందమైన సినీ జీవితం అంత తేలికగా ఆమెకు దక్కలేదు. ఈరోజు అంటే డిసెంబర్ 2 ఆమె పుట్టినరోజు. ఆమె బతికి ఉంటే, ఇప్పుడు 63వ పుట్టినరోజు జరుపుకునేది. ఈ సందర్భంగా సిల్క్ గురించి కొన్ని విశేషాలు గుర్తు చేసుకుందాం.. 

సిల్క్ స్మిత(Silk Smitha Birthday) అంటేనే సౌత్ లో వివాదాస్పద బోల్డ్ స్టార్ గా పేరు. ఆమె ఎంత ఫేమస్ అంటే 2011లో ఏకంగా ఆమె బయో పిక్ ‘ది డర్టీ పిక్చర్’ పేరుతో బాలీవుడ్ లో విద్యాబాలన్ లీడ్ రోల్ గా వచ్చింది. సిల్క్ జీవితంలోని చీకటిని ఈ సినిమా వెలుగులోకి తెచ్చిందని చెబుతారు. 

సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. చాలా పేద ఇంట్లో పుట్టిన సిల్క్ స్మిత పదేళ్ల వయసులోనే చదువు ఆపేసింది. తరువాత అక్కడా ఇక్కడా పనులు చేసేది. తరువాత ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత ఆమె జీవితం మరింత దుర్భరంగా మారడంతో భర్తను వదిలేసి.. చెన్నైకు మకాం మార్చింది. అక్కడ ఆమె సినీ ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పుడే ఆమెకు మెల్లగా నటిగా మారాలనే కోర్కె పుట్టింది. అది బాగా పెరిగి ప్రయత్నాలు మొదలు పెట్టింది. తమిళంలో వండిచక్రం అనే సినిమాలో చిన్న పాత్రతో సినిమాల్లోకి వచ్చింది. ఆలా మెల్లగా తన ప్రస్తానం మొదలు పెట్టిన విజయలక్ష్మి సిల్క్ స్మిత(Silk Smitha Birthday) గా పేరు మార్చుకుని ఇండస్ట్రీలో తనదైన ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సరిగ్గా ఆమె సినిమాల్లోకి వచ్చిన సమయంలో ఇండస్ట్రీలో ఐటం సాంగ్స్ చేసేవారు ఎక్కువ లేరు. దీంతో ఆమె అటువైపు మళ్లింది. ఒకవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ అప్పటి యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూనే.. మరోవైపు నటిగా ప్రాధాన్యం ఉన్న ఛాలెంజ్ వంటి పాత్రలు చేస్తూ వచ్చింది. రజనీకాంత్, చిరంజీవి ఇలా హీరో ఎవరైనా సరే.. సిల్క్ స్మిత పాట లేకుండా అప్పట్లో సినిమా ఉండేది కాదు. 

Also Read: ఆ ఒక్క సీన్ కోసం వాళ్లతో రెండు రాత్రులు గడిపాను.. రాధిక ఆప్టే

జీవితమంతా నిజమైన ప్రేమకోసం పరితపించిన ఆమెకు సినిమాలో చాలా మందితో ఎఫైర్స్ ఉన్నట్టు ప్రచారం బాగా జరిగింది. ఒక దశలో రజనీకాంత్ పేరు కూడా ఆమె పేరుతో ముడిపెట్టి మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, అవి ఎంతవరకూ నిజం అనేది ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఇక ఆమె సినిమాల్లో మంచి దశలో ఉన్నపుడు ఆమెను కొంతమంది నిర్మాతగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు సినిమాలను నిర్మించింది స్మిత(Silk Smitha Birthday). కానీ, రెండూ ఆమెకు భారీగా నష్టాలను తీసుకువచ్చాయి. దీంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. తరువాత ఆమె కోలుకోలేకపోయింది. నమ్ముకున్న వాళ్ళు ఆమెను నట్టేట ముంచేశారు. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు.. సిల్క్ చుట్టూ చేరిన వారంతా ఆమెను విడిచిపెట్టేశారు. దీంతో మద్యానికి బానిస అయిపోయిన ఆమె.. చివరకు 1996లో అంటే తన 36వ ఏటా ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

వెండితెర వెలుగుల జిలుగుల మాటున దాగి ఉండే క్రూరమైన మాయగాళ్ల ఉచ్చు ఎలా ఉంటుందో సిల్క్ స్మిత జీవితం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తన 19వ ఏటనే సినిమాల్లోకి వచ్చిన ఆమె పదేళ్లలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. ఈ లెక్క చాలు ఆమె ఎంత పెద్ద స్థాయికి చేరుకుందో చెప్పడానికి.. క్రమశిక్షణ కోల్పోతే.. డబ్బు లెక్కలలో అదుపు తప్పితే మనిషి జీవితం ఏమైపోతుంది అని చెప్పడానికి కూడా సిల్క్ స్మిత జీవితం పెద్ద ఉదాహరణగా నిలిచిపోతుంది. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు