సిక్కిం (Sikkim) రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతుంది. ఇప్పటికే వరదల (Heavy Rains) వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోగా..ఎన్నో విలువైన ఆస్తులు నాశనం అయ్యాయి. ఈ దెబ్బ నుంచి ఇంకా కోలుకోక ముందే రాష్ట్రానికి మరో పెద్ద ప్రమాదం పొంచి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లొనాక్ సరస్సు తెగిపోవడం వల్ల ఊళ్లు ఏకం అయ్యాయి. దాని వల్ల ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
వందల మంది కనిపించకుండపోయారు. ఇప్పుడు మంగన్ జిల్లాలో ఉన్న షాకో చో సరస్సు తెగిపోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు భయపడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ కూడా జారీ చేశారు. రాష్ట్రం మరోసారి తీవ్ర విధ్వంసం ఎదుర్కొనే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.
Also Read: ఐదురోజులపాటు వివస్త్రలుగా మగువలు..ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని సరస్సు సమీపంలోని ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఈ సరస్సు తంగు గ్రామం పైన ఉంది. ఇక్కడికి చేరుకునే రోడ్డు కూడా వరదలో కొట్టుకుపోయింది. ముఖ్యంగా ప్రమాదం పొంచి ఉన్న జిల్లాలు గ్యాంగ్ టక్, మంగన్ జిల్లా, పాక్యోంగ్ జిల్లా కు చెందిన రంగ్పో, గోలిటారు.
షాకో చో సరస్సు పైన ఉన్న హిమానీనదం ఉష్ణోగ్రతలో అసాధారణ పెరుగుదల ఉన్నట్లు శాటిలైట్ డేటా వివరించిందని బీఆర్వో అధికారులు తెలిపారు. ఇలాగే కొనసాగితే సరస్సు ఎప్పుడైనా పగిలిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఆకస్మాత్తుగా నీరు రావడంతో సరస్సుపగిలిపోతే చాలా నష్టం చోటు చేసుకుంటుంది.
వరదల కారణంగా సుమారు 68 మంది 16000 అడుగుల ఎత్తులో చిక్కుకునిపోయారు. లొనాక్ సరస్సు పై మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో ఆకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల ఇప్పటివరకు 26 మంది మరణించారు. అదే సమయంలో, 2413 మందిని రక్షించగా, 142 మంది ఇప్పటికీ అదృశ్యమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.