NTR: నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను.. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ స్పీచ్‌..!!

ఉత్తమ నటుడిగా సైమా అవార్డు గెలుచుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లో తన అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ సైమా అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడిన మాటలు అభిమానుల హృదయాలను హత్తుకుంటున్నాయి. అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు.

NTR: నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను.. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ స్పీచ్‌..!!
New Update

NTR Emotional Speech at SIIMA Awards 2023: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్-2023 (SIIMA Awards) అట్టహాసంగా జరుగుతోంది. సైమా సెలబ్రేషన్స్‌లో తెలుగు, కన్నడ  తారలు ట్రెండీ దుస్తుల్లో తళుక్కుమన్నారు. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ (RRR Movie) చిత్రానికి గాను ఈ ఏడాది ఉత్తమనటుడి అవార్డును ఎన్టీఆర్ అందుకున్నారు. ధమాకా మూవీలో మెరిసిన శ్రీలీల (Sree Leela) ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళికి ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కగా..సీతారామం మూవీ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది.

publive-image

ఉత్తమ నటుడిగా సైమా అవార్డు గెలుచుకున్నారు ఎంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లో తన అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ సైమా అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడిన మాటలు అభిమానుల హృదయాలను హత్తుకుంటున్నాయి. అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు..


‘‘నా ఒడుదొడుకుల్లో అభిమానులు తోడున్నారు. నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను పట్టుకుని పైకి లేపారు. నా కంటి వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా సంతోషపడ్డారు. నన్ను అభిమానించే అందరికీ తలవంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నాపై నమ్మకంతో కొమురం భీమ్‌ లాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు. ఇక నా సహనటుడు, నా సోదరుడు, స్నేహితుడు చరణ్‌కు కూడా ఈ సందర్భంగా థ్యాంక్యూ చెబుతున్నాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’ (Devara Movie) లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. వాటి కోసం తారక్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ నటిస్తోంది.

2023 సైమా వినర్స్:

ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్. రాజమౌళి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతీ మూవీస్)
ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
ఉత్తమ విలన్: సుహాస్ (హిట్2)
ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్ రెడ్డి (కార్తికేయ 2)
ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్, అనురాగ్ (మేజర్)
ఉత్తమ పరిచయ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం. కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె. సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (నాటు నాటు)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (డీజే టిల్లు)
ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ఠ (బింబిసార)
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ (కార్తికేయ2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడివి శేష్ (మేజర్)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్
ప్రామిసింగ్ న్యూకమర్ (తెలుగు) : బెల్లంకొండ గణేశ్

Also Read: పెదనాన్న కోసం నారా రోహిత్ భారీ స్కెచ్..!!

#rrr-movie #siima-awards-2023 #siima-awards-2023-dubai #ntr-emotional-speech-at-siima-awards-2023 #ntr-emotional-speech #siima-2023-winners #jr-ntr-wins-best-actor-award-for-rrr #jr-ntr-receives-best-actor-award-at-siima
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe