Ramadan : ఈ సంవత్సరం రంజాన్ ఎప్పుడు వస్తుంది?..రంజాన్ ప్రాముఖ్యత ఏంటి? ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో రంజాన్ ఒకటి. రంజాన్ మాసం మొత్తం ముస్లింలందరూ ఉపవాసం ఉంటారు. అయితే ఈ పండగ సమయంలో ఉపవాసం చేయడం వెనుక ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అదేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 07 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Ramadan : ముస్లింలు(Muslims) జరుపుకునే ముఖ్యమైన పండుగలలో రంజాన్(Ramadan) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ రంజాన్ మాసం మొత్తం ఉపవాసం ఉంటారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆహారంతో పాటు కనీసం నీళ్లు కూడా లేకుండా ఉపవాసం ఉంటారు. ఈ రంజాన్ మాసం ఈద్-అల్-ఫితర్(Eid-Al-Fitr) వేడుకతో ముగుస్తుంది. రంజాన్ మాసం సాధారణంగా 29 లేదా 30 రోజులు ఉంటుంది. రంజాన్ అనే పదం అరబిక్(Arabic) మూలం అర్-రామద్ నుండి వచ్చింది. దీని అర్థం మండే వేడి అని అంటున్నారు. అంతే కాదు రంజాన్ ఉపవాసాన్ని ఇస్లాం ఐదు స్థంభాలలో ఒకటిగా చెబుతారు. ఉపవాసం ప్రారంభించే ముందు తినే భోజనాన్ని సెహ్రీ లేదా సుహూర్ అని పిలుస్తారు. సాయంత్రం ప్రార్థన పిలుపు తర్వాత ఉపవాసం విరమించే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. రంజాన్ ఉపవాస ప్రాముఖ్యత రంజాన్ ఆధ్యాత్మికత, స్వీయ అభివృద్ధి, అల్లాహ్(Allah) పట్ల భక్తిని ప్రతిబింబించే పండగ. రంజాన్ సమయంలో ఉపవాసం అనేది స్వీయ క్రమశిక్షణ, ఆధ్యాత్మిక అవగాహనను బోధించే ముఖ్యమైన ఆరాధన . అంతే కాదు కుటుంబ, సమాజ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ నెలలో భక్తి శ్రద్ధలతో రంజాన్ ను పాటించడం ద్వారా మీలోని విశ్వాసం పెంపొందుతుంది. అలాగే అల్లాహ్ కు మిమల్ని మరింత దగ్గర చేస్తుంది. ఈ సంవత్సరం రంజాన్ ఎప్పుడు? ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని దశలను చెబుతుంది. దీనిని సాధారణంగా చంద్ర చక్రం అని పిలుస్తారు. పవిత్ర రంజాన్ నెల ప్రతి సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 10 రోజుల ముందు వస్తుంది. ఈ సంవత్సరం రంజాన్ సోమవారం మార్చి 11 లేదా మంగళవారం మార్చి 12న ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మహిళలు రోజుకు ఎన్ని గంటలు నిద్రించాలి?.. పరిశోధకులు ఏమంటున్నారు? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #muslims #ramadan #fasting-during-ramadan #allah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి