Cauliflower: ఏంటీ కాలిఫ్లవర్ అతిగా తింటున్నారా.. అయితే జాగ్రత్త

కాలిఫ్లవర్ లో ఆరోగ్యానికి కావాల్సిన పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. కానీ మోతాదుకు మించి దీన్ని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అతిగా తీసుకోవడం జీర్ణక్రియ, హైపోథైరాయిడిజం, అలెర్జీ వంటి సమస్యలను మరింత ప్రభావితం చేస్తుంది.

New Update
Cauliflower: ఏంటీ కాలిఫ్లవర్ అతిగా తింటున్నారా.. అయితే జాగ్రత్త

Cauliflower Side Effects:  సహజంగా ఆకుకూరలు, కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఇతర పోషకాలను అందిస్తాయి. అందులో ఒకటి కాలిఫ్లవర్. క్యాబేజీకి మార్పు చెందిన వెర్షన్ కాలిఫ్లవర్. దీనిలో ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డైట్ లో కాలీఫ్లవర్ తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిలోని కోలిన్ పోషకం నిద్ర, కండరాల కదలిక, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాలీఫ్లవర్ తో ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ అతిగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అతిగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం.

కాలీఫ్లవర్ అతిగా తింటే కలిగే నష్టాలు

బ్లడ్ థిన్నర్స్ పై ప్రభావం

బ్లడ్ థిన్నర్స్ మెడికేషన్ తీసుకునే వారు కాలిఫ్లవర్ తీసుకోవడం మంచిది కాదు. దీనిలోని విటమిన్ K ఈ మందుల పని తీరుకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. కావున కాలిఫ్లవర్ అతిగా తీసుకోవడం రక్తం గడ్డకట్టే అవకాశాలను పెంచుతుంది.

ఆకలిని తగ్గిస్తుంది.

కాలిఫ్లవర్ లో కార్బ్స్, ఫ్యాట్స్ తక్కువ.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సమయం వరకు కడుపు నిండుగా ఉందనే భావనను కలిగించి ఆకలిని తగ్గిస్తుంది.

Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

publive-image

జీర్ణక్రియ సమస్యలు

కాలిఫ్లవర్ లో రాఫీనోస్ అనే కాంప్లెక్స్ షుగర్ ఉంటుంది. దీన్ని విచ్ఛిన్నం చేయడం జీర్ణ వ్యవస్థకు కష్టంగా మారుతుంది. అంతే కాదు ఇది పెద్ద పేగులోని బ్యాక్తీరియా కారణంగా పులియబడుతుంది. దీని వల్ల కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మోతాదుకు మించి తినడం మరింత సమస్యను మరింత ప్రభావితం చేస్తుంది.

హైపోథైరాయిడిజం

హైపోథైరాయిడిజం.. థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయనప్పుడు ఈ సమస్య వస్తుంది. ఐయోడిన్ పోషకాహార లోపం హైపోథైరాయిడిజానికి ప్రధాన కారణం. అయితే కాలిఫ్లవర్ థైరాయిడ్ గ్రంథి పని తీరును మరింత ప్రభావితం చేస్తాయి. అందుకే ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ కూరగాయను అతిగా తీసుకోవడం మంచిది కాదని నిపుణుల సూచన. పూర్తిగా మానేయడం మరీ సురక్షితం.

అలెర్జీ

కొందరికి కొన్ని ఆహారాలు తీసుకుంటే అలర్జీ సమస్యలు వస్తాయి. అలాగే కాలిఫ్లవర్ అతిగా తీసుకోవడం కొంత మందిలో దురద, శ్వాస సమస్యలు, వాపు వంటి అలర్జిక్ రియాక్షన్స్ కు కారణమవుతుంది. అందుకే ఏదైన కావాల్సినంత తింటేనే ఆరోగ్యం లేదంటే విషం.

Also Read: Moong Dal Halwa: నోరూరించే పెసర పప్పు హల్వా.. సింపుల్ అండ్ ఈజీ

Advertisment
Advertisment
తాజా కథనాలు