Siddharth – Aditi: మా పెళ్లి కూడా అక్కడే.. ఆ ఆలయంతో ఎంతో అనుబంధం ఉంది..!

హీరో సిద్దార్థ్- అదితి హైదరీ ఇటీవలే శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి తమ పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఆ ఆలయంతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉన్నట్లు చెప్పింది.

New Update
Siddharth – Aditi: మా పెళ్లి కూడా అక్కడే.. ఆ ఆలయంతో ఎంతో అనుబంధం ఉంది..!

Siddharth – Aditi: గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న హీరో సిద్దార్థ్- అదితి హైదరీ.. రీసెంట్ గా మార్చి నెలలో వారి బంధాన్ని బయటపెడుతూ నిశ్చితార్థం చేసుకున్నారు. 'మహాసముద్రం' సినిమాలో కలిసి నటించిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ  వీరిద్దరూ ఎలాంటి హడావిడి లేకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్య వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు.

publive-image

మా పెళ్లి కూడా అక్కడే

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అదితి.. సిద్దార్థ్ తో తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. ఈ క్రమంలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి కూడా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలోనే చేసుకునేందుకు నిర్ణయించుకున్నామని. ఆ ఆలయంతో మా కుటుంబానికి కూడా ఎంతో అనుబంధం ఉందని. అందుకే అక్కడే చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. అలాగే తన ప్రేమ గురించి చెబుతూ.. 'మహాసముద్రం' సినిమా సమయంలో సిద్దార్థ్ తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందని. హైదరాబాద్ లో తనకెంతో ఇష్టమైన, తన నానన్మ కట్టించిన స్కూల్ కు తీసుకెళ్లి సిద్దార్థ్ ప్రపోజ్ చేశాడని తెలిపింది.

Also Read: Siddharth - Aditi : సిద్దార్థ్ - అదితిల పెళ్ళికి ముహూర్తం ఖరారైందా? - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు