/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/s-1-1-jpg.webp)
Shruti Haasan: హీరోయిన్ శ్రుతి హాసన్ కు ముంబై ఎయిర్ పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఆమెను వెంబడించి భయపెట్టాడు. అభిమానిని అంటూ శ్రుతి హాసన్ ను ఫాలో అయ్యాడు. ఈ విషయం గుర్తించిన హీరోయిన్ తన లవర్ శాంతనుతో కలిసి ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్లింది. మధ్యలో ఆగి ఎవరు నువ్వు? అని ప్రశ్నించడంతో అతను పక్కకి వెళ్లిపోయాడు. కానీ, మళ్లీ ఆమెనే ఫాలో అవుతూ కనిపించాడు.
A man follows #ShrutiHaasan at the #airport; tries to come close to her. #WATCH #viral #news #actress #movie #Celebrity #trending
Subscribe to our YouTube page: https://t.co/bP10gHsZuP pic.twitter.com/Xrb34tvB7A
— UnMuteINDIA (@LetsUnMuteIndia) September 19, 2023
పార్కింగ్‌లో ఆమె కారు ఎక్కేంత వరకూ వెంబడించాడు. కాస్త భయపడినట్టు కనిపించిన శ్రుతి హాసన్ నువ్వు ఎవరో నాకు తెలియదు? అంటూ గాబరా పడుతూ కారు ఎక్కేసి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్లిపోయింది. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్నిసార్లు హీరోయిన్స్‌కు ఫ్యాన్స్ వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తెలిసి, తెలియక కొందరు ఫ్యాన్స్ ప్రవర్తనకు హీరోయిన్స్ ఇబ్బంది పడుతుంటారు. తాజాగా శృతి కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కుంది.
గబ్బర్ సింగ్ తో టాలీవుడ్‌లో క్రేజ్ సంపాధించుకున్న శ్రుతి హాసిన్ ఆ సినిమా తర్వాత అంత గొప్పగా సక్సెస్ సాధించలేకపోయింది. అంతంతమాత్రంగానే సినిమాలు చేస్తోంది.ఈ ఏడాది శ్రుతి రెండు విజయాలు అందుకుంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో మెప్పించింది. ఇప్పుడు ప్రభాస్ సరసన నటించిన ‘సలార్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 28నే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.
Also Read : నా జీవితం ఇంతే…ఇలా అయిపోందేమిటి అనుకోవద్దు-సమంత