Sravanamasam2023: నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం...ఉపవాసం ఎలా ఉండాలి...ప్రాముఖ్యత ఏంటి..!! పవిత్రమైన శ్రావణ మాసం నేటి నుండి ప్రారంభం కానుంది. ఈ మాసంలో చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. శ్రావణమాసం ప్రాముఖ్యత ఏంటి...ఈ మాసంలో ఉపవాసం ఉన్నవారు ఏమి తినాలి, ఏమి తినకూడదో తెలుసుకుందాం. By Bhoomi 17 Aug 2023 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి హిందూవులు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసాన్ని పూజల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ఆలయాలు ప్రత్యేక పూజలతో, భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఈ నెలలో ప్రతిరోజూ ప్రత్యేకతే. విష్ణుమూర్తి శ్రవర నక్షత్రంలో జన్మించారు. అందుకే ఈనెలను శ్రావణమాసంగా పిలుస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ నెలలో జన్మించినవారు వేదోక్తకర్మలు నిర్వహించడం, సకల జనుల మన్ననలకు పొందడం, సిరిసంపదలు సమృద్ధితో జీవనం సాగిస్తారని నమ్మకం. శ్రావణమాసంలో సోమవారం శివుడికి అభిషేకాలు, మంగళవారం మంగళగౌరీ వ్రతం, బుధవారం విఠులుడికి ప్రత్యేక పూజలు, గురువారం గురుదేవుడికి ఆరాధన, శుక్రవారం లక్ష్మీదేవి పూజలు, శనివారం హనుమంతుడికి, తిరుమలేశుడికి, శనీశ్వరునికి పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఈనెల మొత్తం భక్తులో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు నిర్వహిస్తుంటారు. ఏ ఇళ్లు చూసినా పూజలతో ఆలయంగా కనిపిస్తుంది. ఒక్కోక్క దేవుడిని పూజించడం తరతరాల నుంచి వస్తోంది. రోజూ చేస్తున్న పూజలే కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్త్రైకాదశి, వరలక్ష్మీవ్రతం, రాశీ పున్నమి, రుషిపంచమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య ఇలా ఎన్నో పండగలు ఈ మాసంలోనే వస్తాయి. ఇక ఈ శ్రావణమాసంలో ఆ పరమశివుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. సోమవారం భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. బిల్వపత్రం, విభూది, గంగా జలంలో శివుడికి అభిషేకాలు చేస్తుంటారు. అంతేకాదు పూజ అనంతరం ఉపవాస దీక్షలు చేపడుతుంటారు. తాంబూలం, దక్షిణం సమర్పించి భక్తులు ఆ భోలాశంకరుడికి హారితి ఇస్తుంటారు. వారికి తోచిన విధంగా పేదలకు దానం చేస్తుంటారు. శ్రావణమాసంలో ఉపవాసం ఎలా ఉండాలి? చాలామంది శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటారు. మాంసాహారం, మద్యపానానికి దూరంగా నెలరోజుల పాటు శాఖాహారం పాటిస్తుంటారు. మరికొందరు రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. ఇలా హిందువులు ఏదో ఒక రూపంలో ఆహార నియంత్రణలను పాటిస్తారు. కాబట్టి ఈ మాసంలో ఆరోగ్యం, భక్తి కోసం ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి. మద్యం, మాంసం తినవద్దు: శ్రావణ మాసంలో మద్యం, మాంసాహారం తీసుకోరాదు. ఈ నెలలో మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండండి. వంకాయ తినకూడదు: శ్రావణ మాసంలో వంకాయ తినకూడదు. ఇది పూర్తిగా అపవిత్రమైనది. చాలా మంది శ్రావణంలో దీనికి దూరంగా ఉంటారు. పాలు, ఆకుపచ్చ కూరగాయలు: ఉపవాసం ఉండే వారు పాలకు దూరంగా ఉండాలి. ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో పాలు, పాల ఉత్పత్తులు అన్ని రకాల దోషాలను అసమతుల్యతను కలిగిస్తాయి. ఇక శ్రావణ మాసంలో పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తినకూడదు. ఎక్కువగా వేయించిన మసాలాలకు దూరంగా ఉండండి. శ్రావణ ఉపవాసంలో ఏమి తినాలి? శ్రావణమాసంలో రోజుకు 10గ్లాసుల వరకు నీరు తాగాలి. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసంతోపాటు తేనె కలుపుని తాగడం మంచిది. ఈ ఉపవాస సమయంలో ఇంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. పండ్లు, జ్యూసులు ఎక్కుగా తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ తీసుకున్నట్లయితే రోజంతా యాక్టివ్ గా ఉంటాయి. మధ్యాహ్నం భోజనంలోకి ఒక గిన్నె సలాడ్ లేదంటే సాబుదాని కిచ్డిని తీసుకోవాలి. రెండు చపాతీలు గిన్నె పప్పు, సూప్, పెరుగు తీసుకుంటే మంచిది. ఇక రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు కానీ లేదంటే మీకు నచ్చిన ఇతర పండ్లు ఏమైనా తినడం మంచిది. #sravanamasam2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి