Paarijatha Parvam Trailer: ‘పారిజాత పర్వం’ ట్రైల‌ర్.. వైవా హర్ష కామెడీ నెక్స్ట్ లెవెల్

సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో చైతన్య రావు, శ్రద్ధా దాస్, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పారిజాత పర్వం. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. సస్పెన్స్, డ్రామా, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

New Update
Paarijatha Parvam Trailer:  ‘పారిజాత పర్వం’ ట్రైల‌ర్.. వైవా హర్ష కామెడీ నెక్స్ట్ లెవెల్

Paarijatha Parvam Trailer: చైతన్య రావు, శ్రద్ధా దాస్, కమెడియన్ సునీల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'పారిజాత పర్వం'. వనమాలి క్రియేషన్స్ బ్యాన‌ర్‌ పై మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన ఈ చిత్రానికి .. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Also Read: Goud Saab: హీరోగా ప్రభాస్ తమ్ముడు ఎంట్రీ.. ‘గౌడ్ సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్

publive-image

పారిజాత పర్వం ట్రైలర్

సస్పెన్స్, డ్రామా, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘కేక్ కట్ చేసేటప్పుడు లైట్స్ ఆపుతారట. మళ్లీ లైట్స్ వేసేలోపు కేక్‌తో పాటు వాళ్ల ఆవిడ కూడా మన బండిలో ఉండాలి’’ అని సునీల్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ మూవీలో సునీల్ ఒక కిడ్నాపర్‌ పాత్రలో కనిపించారు. ఇక చైతన్య రావు, వైవా హర్షలు సునీల్ కోసం పని చేసే ఏజెంట్స్ అన్నట్లుగా చూపించారు. మొత్తానికి సినిమా కథంతా కిడ్నాపుల చుట్టూనే తిరగనున్నట్లు ట్రైలర్ లో హింట్ ఇచ్చారు డైరెక్టర్. చివరిలో లో వైవ హర్ష కామెడీ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది.

publive-image

Also Read: Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ మరో సారి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడే..?

Advertisment
తాజా కథనాలు