Drinking Water : నీళ్లు నిలబడి తాగితే ఏమవుతుందో తెలుసా?

మనం రోజుకు 4నుంచి5 లీటర్లు నీళ్లు తాగాలని నిపుణులు చెబుతుంటారు. అయితే నీళ్లు నిలబడి తాగితే వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం..

Drinking Water : నీళ్లు నిలబడి తాగితే ఏమవుతుందో తెలుసా?
New Update

Water : నిత్యం పలు పనుల్లో బిజీగా ఉండేవాళ్లు అనేక సందర్భాల్లో నిలబడి నీళ్లు తాగుతుంటారు(Drinking Water). ఇలా చేయొచ్చని కొందరు అంటే మరి కొందరు మాత్రం నిలబడి నీరు తాగడం హానికరమని భావిస్తుంటారు. అయితే, ఆయుర్వేదం(Ayurveda) ఈ అంశంపై విస్పష్టమైన సూచనలు చేసింది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, నిలబడి నీళ్లు తాగడం అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది.

ఆర్థరైటిస్..
నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లల్లో నీరు పేరుకుంటుందట. అంతేకాకుండా, ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌(Fluid Balance) ను దెబ్బతిని విషతుల్యాల విడుదలకు కారణమవుతుంది. అంతిమంగా ఇది కీళ్లనొప్పుల బారిన పడేలా చేస్తుంది.

జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు
నిలబడి నీళ్లు తాగడంతో నీరు వేగంగా కడుపులోకి చేరుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇది కడుపులో జీర్ణరసాల సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా, అరుగుదల తగ్గుతుంది. కాబట్టి, నీటి ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే నిలబడి నీరు తాగకపోవడమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఆధునిక వైద్య శాస్త్ర నిపుణులు మాత్రం ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిలబడి నీళ్లు తాగినా, కూర్చుని నీళ్లు తాగినా పెద్ద తేడా ఏమీ ఉండదని చెబుతున్నారు. అయితే, పడుకుని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ నీరు తాగొద్దని హెచ్చరిస్తున్నారు.

వైద్యుల ప్రకారం, శరీరం నీరును వేగంగా గ్రహిస్తుంది. మనం తాగే నీటిలో 66 శాతం కణాల్లోకి చేరుతుంది. 25.5 శాతం కణాల మధ్య ఉండే ఇంటర్‌స్టిషియల్ ఫ్లూయిడ్‌లో భాగమవుతుంది. 8.5 శాతం రక్తంలో కలుస్తుంది. ఇక శరీరంలోని అధికంగా ఉన్న నీటిని, మలినాలను కిడ్నీలు నియంత్రిత విధానంలో తొలగిస్తాయి.

Also Read : గుండె ఆరోగ్యానికి వేడి నీరు తాగడం మంచిదేనా?

#drinking-water #side-affects-ayurveda-health
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe