US Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు..నలుగురు మృతి..!!

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఫిలడెల్ఫియాలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు బాల్టిమోర్ నగరంలో ఓ పార్టీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.

New Update
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు..నలుగురు మృతి..!!

అమెరికాలో కాల్పుల ఘటనలు సర్వసాధారణమయ్యాయి. ఈ మధ్యకాలంలో తరచుగా కాల్పులు జరుగుతున్నాయి. నిత్యం ఏదొక చోట కాల్పులు జరుగుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. అదే సమయంలో మరికొందరు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి రైఫిల్‌, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌క్వైరర్, ABC న్యూస్ అనుబంధ సంస్థలు ఈ కాల్పుల్లో ఇద్దరు టీనేజర్లు మరణించినట్లు నివేధించాయి. ఈ ఘటనలో గాయపడిన ఆరుగురు బాధితులను పెన్ ప్రెస్‌బిటేరియన్ మెడికల్ సెంటర్‌కు తరలించామని, ఇద్దరు ఫిలడెల్ఫియాలోని చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికార ప్రతినిధి జాస్మిన్ రీల్లీ తెలిపారు.

publive-image

కాగా జులై 2న దక్షిణ భాగంలోని బ్రూక్లిన్ హోమ్స్ పరిసరాల్లోని బ్రూక్లిన్ డే యానివర్సరీ పార్టీ శనివారం ప్రారంభమైంది. ఈ పార్టీకి వందమంది హాజరయ్యారు. యానివర్సరీ వేడుకలను సంతోషంగా జరుపుకుంటున్న సందర్భంలో అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత ఒక్కసారిగా కాల్పులు మోతలు వినిపించాయి. గుర్తుతెలియని వ్యక్తి 30 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అనుమానతుడిని అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. 19 మంది బాధితులు మెడ్‌స్టార్ హార్బర్ హాస్పిటల్‌లోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది రోగుల పరిస్థితి నిలకడగా ఉన్న తర్వాత వారిని బాల్టిమోర్ ట్రామా సెంటర్‌కు తరలించారు.

అటు కాన్సాస్ లో జరిగిన మరో ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఉత్తర వాషింగ్టన్ వీధిలో సీటీ నైట్ క్లబ్ లో ఒక్కసారిగా కాల్పులు జరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మరో ఇద్దరు తీవ్రగాయపడటంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు పోలీసులు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కాల్పులు జరిపిన స్థలంలో నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈఘటనకు పాల్పడిన అనుమానుతుడిని ఆదివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు