/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Pinnelli-Ramakrishna-Reddy.jpg)
Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. రెంటచింతల మండలం పాలువాయి గేటులో ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావును ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెదిరించి ఆ తరువాత దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు మరో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 307,147,148,120బి, 324,రెడ్ విత్ 149 సెక్షన్ల కింద రెంటచింతల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.