NTR District: మైలవరంలో వైసీపీకి షాక్..కీలక నేత రాజీనామా

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేశారు మాజీ మండల అధ్యక్షుడు బొమ్మసాని చలపతిరావు. పార్టీ కోసం పనిచేసిన తనకు గుర్తింపు ఇవ్వకపోవడంపై బొమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
NTR District: మైలవరంలో వైసీపీకి షాక్..కీలక నేత రాజీనామా

NTR District: ఏపీ అధికార పార్టీ వైసీపీలో అసమ్మతి నేతలు పెరిగిపోతున్నారు. ఇప్పటికే, పార్టీ లోని కొందరూ ముఖ్యనేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేశారు మాజీ మండల అధ్యక్షుడు బొమ్మసాని చలపతిరావు. పార్టీ కోసం పనిచేసిన తనకు గుర్తింపు ఇవ్వ లేదని.. గుర్తింపు లేని చోట తాను ఉండలేనని చెబుతూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి కీలక నేతగా ఉన్న  మాజీ మండల అధ్యక్షుడు బొమ్మసాని చలపతిరావు రాజీనామా చేయడంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.

Also Read: ప్రభాకర్ నిర్దోషని నిరూపిస్తాడా..! ముకుందతో మురారి పెళ్లి?

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జోగి రమేష్‍పై తీవ్ర విమర్శలు చేశారు బొమ్మసాని చలపతిరావు. ఎన్నికల వేల వీటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‍ను ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయం సొంత ఎస్టేట్‍గా మార్చి ఇన్‍ఛార్జ్ లను సూపర్ వైజర్లుగా పార్టీ నాయకులు, కార్యకర్తలను స్వీపర్లుగా ఎమ్మెల్యే వసంత మార్చారని ఆరోపించారు.


Also Read: బ్రహ్మముడి సీరియల్ లో ట్విస్ట్.. కల్యాణ్ తో ఆమె పెళ్లి.!

పార్టీ కోసం ఎంత కష్టపడినా గుర్తింపు ఇవ్వడం లేదని వాపోయారు. సొంత డబ్బుతో సేవలు చేసినా ఫలితం లేదని..అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఎదైనా సమస్య వస్తే అడిగేందుకు కూడా ఇబ్బంది పడాలని అన్ని అవమానాలు భరిస్తూ తాను ఉండలేనని చెప్పుకొచ్చారు. ఈ విధంగా పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు