Ananthapuram: ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కదిరి నియోజకవర్గ ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నారు 200 మంది పైగా వైసీపీ నేతలు. ఇందులో సర్పంచులు, ఎంపీటీసీలు మండల వైసీపీ కన్వీనర్లు సైతం ఉన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ అధికార పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పించారు.
Also Read: తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేకత ఏంటో తెలుసా.?
కదిరి నియోజకవర్గంలో వైసీపీలో ఉండాలంటేనే నేతలు భయపడుతున్నారని.. అందుకే ఈరోజు టిడిపిలో జాయిన్ అవుతున్నారని కామెంట్స్ చేశారు. ఎంపీటీసీలు, సర్పంచులు , మండల పార్టీ కన్వీనర్లు జగన్ నిజ స్వరూపాన్ని తెలుసుకుని షాక్ అయి టిడిపిలోకి వస్తున్నారని కామెంట్స్ చేశారు. సీఎం జగన్ తన ఓటమిని తనే రాసుకున్నాడని అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంతోనే జగన్ పని అయిపోయిందని వ్యాఖ్యనించారు.
Also Read: పత్తి కూలీలపై పులుల దాడి.. ఆ జిల్లాను వణికిస్తున్న కృర మృగాలు
సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందులకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలంలోని వైసీపీ నేతలు కూడా జగన్ ని నమ్మలేక టిడిపిలోకి వెళ్తున్నారని వెల్లడించారు. కదిరి నియోజకవర్గం టిడిపి అడ్డా అని పేర్కొన్నారు. చాంద్ బాషా.. నాతో కలిసి పనిచేస్తాడా ?లేదా? అనేది తనకు తెలియదన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని స్థానాల్లోనూ టిడిపి గెలవబోతుందని ధీమ వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారని వెల్లడించారు.