Airtel: ఎయిర్ టెల్ తన వినియోగదారులకు షాకిచ్చింది. ఇప్పటికే భారీగా పెరిగిన మొబైల్ టారిఫ్ లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ సంకేతాలు ఇచ్చారు. పరిశ్రమ బాగుండాలంటే టారీఫ్ ల పెంపు కీలకమని వివరించారు. సోమవారం కంపెనీ ఆర్థిక ఫలితాల సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో..కంపెనీ పెట్టుబడులపై రాబడి ఇంకా కనిష్టంగా 9.4శాతమే ఉందని..పరిశ్రమ బాగుండాలంటే టారీఫ్ ల పెంపు కీలకమన్నారు .
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో
డిసెంబర్ తో ముగిసిన మూడవ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికరలాభం 54శాతం వ్రుద్ధిచెంది రూ. 2,442 కోట్లుకు చేరిందన్నారు. ఆదాయం 5.8శాతం వ్రుద్దితో రూ. 37, 899కోట్లకు పెరిగింది. భారత్ లో కంపెనీ చందాదారుల సంఖ్య 7.5శాతం పెరిగి 39.7కోట్లకు చేరింది. యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ పర్ 7.7శాతం పెరుగుదలతో రూ. 193 నుంచి రూ. 208కి చేరింది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం!