Shobha shetty: "మీ ప్రేమకి రుణపడి ఉంటాను".. శోభ శెట్టి ఇన్స్టా గ్రామ్ పోస్ట్

కార్తీక దీపం సీరియల్ తో ఫుల్ పాపులరైన శోభ.. బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇన్స్టా లో 6 లక్షల ఫాలోవర్స్ చేరుకున్న సందర్భంగా థ్యాంక్స్ చెబుతూ 'మీ ప్రేమకి రుణపడి ఉంటానని రాసుకొచ్చింది.

New Update
Shobha shetty: "మీ ప్రేమకి రుణపడి ఉంటాను".. శోభ శెట్టి ఇన్స్టా గ్రామ్  పోస్ట్

Shobha shetty: బుల్లి తెర ప్రేక్షకులకు శోభ శెట్టి బాగా సుపరిచితురాలు. ఒకప్పుడు టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్లిన కార్తీక దీపం సీరియల్ లో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఈ సీరియల్ తో తెలుగులో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది.

publive-image

ఈ పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 7 లో ఎంట్రీ ఇచ్చింది ఈ బుల్లి తెర బ్యూటీ. తన ఆట, మాట తీరుతో ప్రేక్షకులలో మరింత క్రేజ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోస్, ఇంటర్వూస్ లో పాల్గొంటూ బిజీగా ఉంది.

publive-image

ఇటీవలే 'కాఫీ విత్ శోభ' అంటూ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇది ఒక సెలెబ్రెటీ టాక్ షో. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అలాగే కొద్దీ రోజులు సీరియల్స్ గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలిపింది.

Also Read: Pushpa 2 OTT Release: ఆ OTT సంస్థతో ఒప్పందం ఫిక్స్.. pushpa-2 నుంచి అదిరే అప్డేట్

publive-image

సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇన్స్టా లో 6 లక్షల ఫాలోవర్స్ చేరుకున్న సందర్భంగా థ్యాంక్స్ చెబుతూ.. మీ ప్రేమకి రుణపడి ఉంటానని రాసుకొచ్చింది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది ఈ బుల్లితెర బ్యూటీ.

publive-image

ఇన్స్టా లో మాత్రమే కాదు యూట్యూబ్ లో కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వీడియోలు చేస్తూ యాక్టివ్ గా కనిపిస్తుంది. కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు తమ్ముడి పాత్రలో నటించిన యశ్వంత్ రెడ్డి, శోభ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే బిగ్ బాస్ స్టేజ్ పై ఈ విషయాన్నీ బయట పెట్టిన సంగతి తెలిసిందే.

publive-image

Also Read: Shekar Kammula Movie: శేఖర్ కమ్ముల మల్టీ స్టారర్.. ధనుష్ తో పాటు మరో అగ్ర హీరో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు