/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-10-5-jpg.webp)
Shobha Shetty: తెలుగు ప్రేక్షకులు సినిమాల కంటే సీరియల్స్ ఎక్కువ ఫాలో అవుతారు. కొన్ని సీరియల్స్ త్వరగా ఫేడ్ ఔట్ అయిపోతే.. మరికొన్ని సీరియల్స్ సంవత్సారాలు కొద్ది ప్రేక్షకుల ఆదరణ పొందుతాయి. వాటిలో ఒకటి కార్తీక దీపం. స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్స్ కార్తీక దీపం నంబర్ 1 సీరియల్ గా గుర్తింపు తెచ్చుకుంది. టీవీలో కాదు సోషల్ మీడియా మీమ్స్ లో ఈ సీరియల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సీరియల్ తో పాటు ఈ సీరియల్ లో నటించిన యాక్టర్స్ కూడా అంతే ఫేమస్. డాక్టర్ బాబు, వంటలక్క, సౌందర్య, మోనిత పాత్రలు అందరికీ గుర్తుంటాయి. కొంత మంది సీరియల్ నటులు వారు చేసే పాత్రలతో ఎక్కువ ఫేమస్ అవుతుంటారు. వాళ్ళ రియల్ నేమ్ కంటే రీల్ పేర్లనే ప్రేక్షకులు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు.
అలాగే కార్తీక దీపం సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన శోభ శెట్టి( మోనితా) ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. మోనితా పాత్ర శోభకు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. సీరియల్ ఎంత హిట్ అయ్యిందో.. ఆమె పాత్ర కూడా అంతే హిట్. నెగటివ్ రోల్ లో లేడీ విలన్ గా మార్క్ సెట్ చేసింది. తాజాగా శోభ శెట్టి ఈ పాత్రకు అవార్డ్ అందుకున్నారు. నెగటివ్ రోల్ క్యాటగిరిలో బెస్ట్ విలన్ గా రాష్ట్రీయ గౌరవ్ పురస్కార్ అవార్డును సొంతం చేసుకుంది.ఈ విషయాన్ని శోభ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. "నా జర్నీలో నాకు ఇంతగా సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నానను" అంటూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
View this post on Instagram
Also Read: Big 4: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ, నాగ్.. ఎందుకంటే?