బీజేపీలో మరో కొత్త పంచాయితీ.. ఎంపీ అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు

ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టార్గెట్ గా శేరిలింగంపల్లి బీజేపీ నేత యోగానంద్ సంచలన వాఖ్యలు చేశారు. తనను ఇబ్బందులకు గురి చేస్తే కోరుట్ల అసెంబ్లీ, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో వేలు పెడతానని హెచ్చరించారు.

New Update
బీజేపీలో మరో కొత్త పంచాయితీ.. ఎంపీ అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు

ఇప్పటికే ముఖ్య నేతల వలసలతో పట్టెడు కష్టాల్లో ఉన్న బీజేపీకి (BJP) రోజుకో కొత్త తలనొప్పి ఎదురవుతోంది. ఓ వైపు జనసేనతో (Jansena) పొత్తుల పంచాయితీ సాగుతుండగా.. తాజాగా మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శేరిలింగంపల్లి టికెట్ ఆశిస్తున్న యోగానంద్ చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy), నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. నిజామాబాద్ కు చెందిన అర్వింద్ తో శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కోరుట్లలో తనకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారని పరోక్షంగా ఎంపీ అర్వింద్ కు వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Telangana BJP: విజయశాంతికి షాక్ ఇచ్చిన బీజేపీ.. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే!

అర్వింద్ ఉంటే అందరికీ మంచిదన్నారు. తనకు టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ ను గెలిపించినట్లేనన్నారు. తనకు అసెంబ్లీ ఇవ్వకుంటే చేవెళ్ల పార్లమెంట్ సీటు అడుగుతానని కొండా విశ్వేశ్వర్ రెడ్డిని హెచ్చరించారు. ఆర్టీవీకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వాఖ్యలు చేశారు యోగానంద్. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
తాజా కథనాలు